King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!

King Cobra in Bathroom: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ కింగ్ కోబ్రా ఇంట్లోని బాత్రూమ్ లోకి దూరి హల్ చల్ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 01:34 PM IST
King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!

King Cobra in Bathroom: పాముల్లోకెల్లా అత్యంత విషాన్ని కలిగి ఉన్న పాము కింగ్ కోబ్రా. విషపూరితమైనదే కాకుండా పొడవైన పాము. ఇలాంటి పాము మనుషులను కాటేస్తే నిమిషాల వ్యవధిలో ప్రాణాలను కోల్పోతారు. వాటి విషం విరుగుడుకు ఇప్పటికీ సరైన మందు లేకపోవడం గమనార్హం. అలాంటి ప్రమాదకరమైన పాములు నిత్యం జనావాసంలో వస్తుంటాయి. ఓ పాము అయితే ఏకంగా బాత్ రూమ్ లోకి దూరింది. దాన్ని గమనించిన ఇంటి యజమాని.. వీడియో తీసి ఇంటర్నెట్ లో షేర్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. 

ఓ వ్యక్తి ఇంట్లోకి కింగ్ కోబ్రా ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేసవి తాపంతో ఆ ఇంట్లోని బాత్రూంలోకి దూరింది. దాన్ని గమనించిన ఇంటి యజమాని.. బాత్రూమ్ డోర్ తెరవగానే అందులో గోడపైకి ఎక్కేందుకు కింగ్ కోబ్రా ప్రయత్నిస్తుంది. టాయిలెట్ పేపర్ రోల్ గుండా దూరడం వల్ల దాన్ని నడుముకు కట్టుకున్నట్లు ఉంది. అది దగ్గరకు వస్తుందని గమనించిన ఇంటి యజమాని వెంటనే బాత్ రూమ్ డోర్ క్లోజ్ చేశారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kingdom of snakes 🐍 (@snake_unity)

సోషల్ మీడియాలో ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. స్నేక్_యూనిటీ అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. వీడియో 55,700 కంటే ఎక్కువ మంది వీక్షించారు. 

Also Read: Viral Video: శ్రీవల్లీ పాటలోని ఐకానిక్ స్టెప్పును అనుకరించిన చింపాంజి - వీడియో వైరల్

Also Read: Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని జంతువులున్నాయో చెప్తే.. మీరు నిజంగా మేధావే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News