Bike Riders Attack On Traffic Police: రోడ్డుమీద కొందరు తరచుగా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా చెప్పిన అస్సలు పట్టించుకోరు. బైక్ మీద ట్రిబుల్ రైడింగ్ చేస్తుంటారు. అంతే కాకుండా.. హెల్మెట్ లు లేకుండా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తుంటారు. మరికొందరు తాగి మరీ బైక్ లు, కార్లు నడిపిస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. పోలీసులు ఎంత చెప్పిన కూడా కొందరు మాత్రం తమ పంథాను అస్సలు మార్చుకోరు. ఈక్రమంలో రోడ్డు ప్రమాదాలు చేస్తూ, ఇతరులను కూడా ప్రమాదాల్లో నెట్టెస్తుంటారు.
#Karnataka : Mohammad Syed Shafi attacked traffic Policemen and attempted to bite his hand and snatch & run away with their phone when they clicked his pic for not wearing Helmet in Bengaluru.
This is how law & order is made a joke by Congress core votebank. I fear after this… pic.twitter.com/UXa9H4XhIn
— Amitabh Chaudhary (@MithilaWaala) February 13, 2024
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తు ట్రాఫిక్ నిబంధలను బ్రేక్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తుంటారు. రోడ్డు మీద తరచుగా ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుంటారు. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్ సరిగ్గా చేయించుకున్నారా .. లేదా అంటూ కూడా చెక్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపైన తిరగబడుతుంటారు. పోలీసులపైకి దుర్బాషాలాడుతూ.. దాడులు చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. తాజాగా, మరో ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
పూర్తివివరాలు..
బెంగళూరులోని విల్సన్ గార్డెన్ రోడ్ నంబర్ 10 వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆసమయంలో పోలీసులకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. మహ్మద్ సయ్యద్ షఫీ అనే బైక్ రైడర్ ను పోలీసులు పట్టుకున్నారు. అతను హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపించాడు. దీంతో పోలీసులు అతని బైక్ ఫోటో తీశారు. ఈ క్రమంలో అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.అంతే కాకుండా.. పోలీసుపై దాడిచేసి చేతి వెలిని సైతం కొరికాడు. అనుకొని ఈ ఘటనతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను తిట్టడం, దాడిచేసి గాయపర్చడం వంటి ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇదేంది బాబోయ్ కొరుకుడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read More: Keerthy Suresh: కీర్తి సురేష్ కి ప్రేమలేఖ.. ఆ అబ్బాయి గురించి బయట పెట్టిన హీరోయిన్
మరోవైపు.. కొందరు సీఎం సిద్దరామయ్య.. మైనారిటీలను ఇబ్బంది కల్గించినందుకు పోలీసులను సస్పెండ్ చేస్తారంటూ సెటైర్ లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడడం, శారీరకంగా గాయపర్చడం, నేరపూరిత బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.