IRCTC BUG: ఐఆర్‌సీటీసీలో బగ్ గుర్తించిన ఇంటర్ విద్యార్ధి, తప్పిన పెను ప్రమాదం

IRCTC BUG: ఐఆర్‌సీటిసి..ఇండియన్ రైల్వేలో కీలకమైన ఓ శాఖ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణీకుల వివరాలన్నీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి. అంతటి కీలకమైన ఐఆర్‌సీటీసీలో బగ్‌ను గుర్తించాడు ఇంటర్నీడియట్ విద్యార్ధి. వివరాలిలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 21, 2021, 10:03 PM IST
  • ఇండియన్ రైల్వే ఈ టికెటింగ్ వేదిక ఐఆర్‌సీటీసీకు తప్పిన పెను సమస్య
  • సైట్‌లో బగ్ గుర్తించిన చెన్నైకు చెందిన రంగనాధ్ అనే ఇంటర్ విద్యార్ది
  • అప్రమత్తమైన ఐటీ వింగ్, బగ్ సమస్య పరిష్కారం
IRCTC BUG: ఐఆర్‌సీటీసీలో బగ్ గుర్తించిన ఇంటర్ విద్యార్ధి, తప్పిన పెను ప్రమాదం

IRCTC BUG: ఐఆర్‌సీటిసి..ఇండియన్ రైల్వేలో కీలకమైన ఓ శాఖ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణీకుల వివరాలన్నీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి. అంతటి కీలకమైన ఐఆర్‌సీటీసీలో బగ్‌ను గుర్తించాడు ఇంటర్నీడియట్ విద్యార్ధి. వివరాలిలా ఉన్నాయి.

ఇండియన్ రైల్వే ఈ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ(IRCTC)గురించి తెలియని వారుండరు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణీకులు ఈ పోర్టల్ నుంచే టికెట్ బుకింగ్ చేస్తుంటారు. అంతటి కీలకమైన ఐఆర్‌సీటీసీకు హ్యాకర్ల నుంచి ప్రమాదం తృటిలో తప్పింది. చెన్నైలోని తాంబరం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల రంగనాథ్ అనే విద్యార్ధి రైల్వే టికెట్ బుక్ చేసేందుకు ఈ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ ఓపెన్ చేశాడు. ఆగస్టు 30వ తేదీన టికెట్ బుక్ చేసే క్రమంలో వెబ్‌సైట్‌లో బగ్‌ గుర్తించాడు. వెంటనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు సమాచారం చేరవేశాడు. ఈ సమాచారం అందుకున్న రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఎందుకంటే బగ్ సహాయంతో లక్షలాది ప్రయాణీకుల డేటా హ్యాకర్ల చేతిలో పడే ప్రమాదం కచ్చితంగా ఉంది. బగ్ సహాయంతో ప్రయాణీకుల పేరు, వయసు, ప్రయాణ వివరాలు పీఎన్ఆర్ నెంబర్, డెస్టినేషన్ ట్రావెల్ వంటి వివరాల్ని హ్యాకర్లు (Hackers)తెలుసుకోగలరు. ప్రయాణీకుల ప్రమేయం లేకుండా టికెట్ కూడా రద్దు చేసేయవచ్చు. 

అందుకే రంగనాథ్ నుంచి సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన ఐఆర్‌సీటీసీ ఐటీ వింగ్ అప్రమత్తమై చెక్ చేసింది. బగ్ ఉందని గుర్తించింది. వెంటనే బగ్ సమస్యను పరిష్కరించి సెప్టెంబర్ 11వ తేదీన రంగనాథ్‌కు మెయిల్ పంపింది. పన్నెండో తరగతి చదువుతున్న రంగనాథ్ గుర్తించిన బగ్‌ను(Chennai student detected bug in irctc) సరిచేశామని రైల్వేశాఖ వెల్లడించింది. మొత్తానికి విద్యార్ధి చొరవతో రైల్వేశాఖకు(Indian Railways)పెను సమస్య తప్పింది. 

Also read: World Dangerous Places: ప్రపంచంలో అత్యంత డేంజరస్ ప్రదేశాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News