Human Sized Bats: వామ్మో.. మనిషి సైజు గబ్బిలాలు... ఎక్కడున్నాయంటే.. ??

గబ్బిలాలు.. ఇంట్లోకి వస్తే అరిష్టమని మన పెద్దవాళ్లు చెప్తుంటారు.. కానీ మనిషి సైజులో గబ్బిలం తారసపడితే ఏం చేస్తారు..?? అవునండి.. దాదాపు మన సైజులో ఉండే గబ్బిలాలు కూడా ఉన్నాయి.. అదెక్కడో చూద్దాం పదండి మరీ!

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 10:25 PM IST
  • మనిషి సైజులో ఉండే గబ్బిలాలు
  • ఇవి పూర్తీ శాఖాహారులట.. మనుషుల్ని ఎం చేయవట!
  • వీటి రెక్కలు దాదాపు 5.5 అడుగుల వెడల్పు వరకు ఉంటాయట
  • ఈ భారీ సైజు గబ్బిలాలు ఫిలిప్పైన్స్‌లో ఉన్నాయట
Human Sized Bats: వామ్మో.. మనిషి సైజు గబ్బిలాలు... ఎక్కడున్నాయంటే.. ??

Human Sized Bats: సాధారణంగా గబ్బిలం (Bats) చిన్న పరిమాణంలో ఉంటుంది. కాస్త పెద్దది అయితే ఇంకాస్త ఎక్కువ సైజులో ఉంటుంది. అప్పుడప్పుడు చీకట్లో తారస పడుతూనే ఉంటాయి. అయితే దాదాపు మనిషంత సైజులో ఉన్న గబ్బిలం కూడా ఈ ప్రపంచంలో ఉంది. మీరు చదివేది నిజమే. 

ఆ సైజు గబ్బిలాలు ఎక్కడున్నాయంటే.. ?? ఫిలిప్పైన్స్‌ . అలెక్స్ అనే వ్యక్తికి ఓ పాత ఇంటి ఆవరణలో మనిషంత ఉన్న గబ్బిలం కంటబడింది. భారీ గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ అతడికి కనిపించింది. దీనిని చూసిన అలెక్స్.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే తన మొబైల్ ఫోన్‌లో దానిని ఫోటోలు తీసి.. ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ భారీ గబ్బిలం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Also Read: Man Gave water to King Cobra: బాప్రే.. వీడు మగాడ్రా బుజ్జి.. కింగ్ కోబ్రాకే నీళ్లు తాగించాడు..!!

ఫిలిప్పైన్స్‌లో (Philippines)ఉన్న ఈ భారీ సైజు గబ్బిలం (Human Sized Bats) రెక్కలు దాదాపు 5.5 అడుగుల వెడల్పు ఉంటాయని, దాదాపుగా మనిషంత ఉందని అలెక్స్ తన ట్వీటులో పేర్కొన్నాడు. ఈ గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ చూడడానికి చాలా అందంగా ఉందట. ప్రత్యేక రకానికి చెందిన (జైంట్ గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లైయింగ్ ఫాక్స్) ఈ గబ్బిలాలు పూర్తి శాకాహారులని, కేవలం పండ్లను మాత్రమే తింటాయని చెప్పాడు. ఈ రకం గబ్బిలాలు ఏమాత్రం మాంసాహారం ముట్టవని అతడు చెప్పుకొచ్చాడు. 

అలెక్స్ (Alex) ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలకు లక్షల్లో లైక్స్, రీట్వీట్స్ వచ్చాయి. చాలా మంది ఈ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు. దాంతో రెండు రోజుల్లోనే ఈ గబ్బిలం మ్యాటర్ జనాలకు తెలిసిపోయింది. లక్షలాది మంది కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ గబ్బిలం జైంట్ గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లైయింగ్ ఫాక్స్ (Giant Golden-Crowned Flying Fox) రకానికి చెందినది అని కొందరు నిపుణులు స్పష్టం చేశారు. అయితే ఈ రకం గబ్బిలాలు మనిషంత సైజులో మాత్రం ఉండవట. చిన్నగానే ఉన్నా.. దీని రెక్కల పొడుగు మాత్రం 5 అడుగులకు పైగా ఉంటుంది. అందుకే వేలాడుతున్న సమయంలో మనకు భారీ స్థాయిలో కనబడుతుంది. ఫొటో తీసిన విధానాన్ని బట్టి కూడా పెద్దగా, పొడవుగా ఉన్నట్టు మనకు అనిపిస్తోంది. ఈ జాతి గబ్బిలాలు సాధారణ గబ్బిలాల కంటే పెద్దవిగానే ఉంటాయన్నది మాత్రం నిజం. రోజురోజుకు అడవులు తగ్గిపోవడంతో ప్రస్తుతం ఈ గబ్బిలాలు అంతరించే దశలో ఉన్నాయి. 

Also Read: MAA Elections: సంచలనం రేపుతున్న పృథ్వీరాజ్‌ ఆడియో టేప్.. రసవత్తరంగా 'మా' ఎన్నికలు

అతి తక్కువగా కనిపించే ఈ గబ్బిలాలు ఆస్ట్రేలియా (Australia), న్యూజిలాండ్‌ (New Zealand), న్యూ గినియా, ఆఫ్రికా (Africa) తదితర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొంచెం ఇంచుమించుగా కుక్క ముఖాన్ని (Dog Face Bats) పోలిన ఈ గబ్బిలాలు కేవలం పండ్లనే ఆహారంగా తీసుకుంటాయట. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లోనే ఈ రకం గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయి.  ఇక అలెక్స్ పోస్ట్ చేసిన ఫొటోకు ఓ వ్యక్తి ఇలా కామెంట్ పెట్టాడు. "మీరు చూసింది నిజమే. ఇలాంటి పెద్ద సైజు గబ్బలాలు ఇప్పటికీ అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ ఇవి కనిపించినంత భారీ సైజులో ఉండవు. ఇంకా చెప్పాలంటే సాధారణ గబ్బిలాల సైజులోనే ఉంటాయి. కానీ రెక్కలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి" అని రిప్లయ్ ఇచ్చాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News