కంప్యూటర్‌ను వైరస్ నుండి కాపాడండిలా..!

ఈ రోజు కంప్యూటర్ యూజర్లను వేధిస్తున్న ప్రధాన సమస్య "వైరస్". నేడు ఎన్ని రకాల సాఫ్ట్‌వేర్లు మనం వాడుతున్నా, ఈ వైరస్ బారి నుండి కంపూటర్లను లేదా ల్యాప్‌టాప్‌లను కాపాడడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది

Last Updated : Dec 7, 2017, 01:16 PM IST
కంప్యూటర్‌ను వైరస్ నుండి కాపాడండిలా..!

ఈ రోజు కంప్యూటర్ యూజర్లను వేధిస్తున్న ప్రధాన సమస్య "వైరస్". నేడు ఎన్ని రకాల సాఫ్ట్‌వేర్లు మనం వాడుతున్నా, ఈ వైరస్ బారి నుండి కంపూటర్లను లేదా ల్యాప్‌టాప్‌లను కాపాడడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. సరైన సాంకేతిక పద్ధతులు తెలియకపోవడమే అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. మరీ ఈ వైరస్ సమస్యను నివారించడానికి ఏం చేయాలో మనం ఈ రోజు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం..

యాంటీ వైరస్ ఎంపిక : మన కంప్యూటర్ వైరస్ బారిన పడకుండా కాపాడడానికి తొలిమెట్టు యాంటీ వైరస్‌ను మనం డౌన్లోడ్ చేసుకోవడమే. అయితే ఇంటర్నెట్‌లో దొరికే ఉచిత యాంటీ వైరస్ డౌన్లోడ్ చేసుకొని.. తర్వాత దానితో ఇక్కట్లు పడేవారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అలాంటి వాటిలో ఫేక్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

అందుకే  ముందుగా యాంటీ వైరస్ డౌన్లోడ్ చేసుకొనేటప్పుడు.. అది ఏ కంపెనీ యాంటీ వైరస్ అనేది ముందు తెలుసుకోవాలి. ఆ ప్రొడక్టు గురించి బాగా పరిశీలన చేయాలి. సాధారణంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న నార్టన్ యాంటీ వైరస్ మొదలైన వాటినే ఉపయోగించడం మంచిది. అందులో కొన్ని ఉచితంగా లభిస్తే.. కొన్ని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లను డబ్బులిచ్చి కొనుక్కోవలసి ఉంటుంది. 

యాంటీ స్పైవేర్ విషయంలో జాగ్రత్త: సాధారణంగా యాంటీ వైరస్ డౌన్లోడ్ చేసుకున్నాక.. ఇక సమస్యలన్నీ తొలిగినట్లే అని యూజర్లు భావిస్తారు. అయితే మీరు సిస్టమ్‌లో ఎక్కించే యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లో యాడ్ వేర్ మరియు స్పై వేర్‌ను నివారించే యాంటీ స్పైవేర్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఇప్పుడు పలు ప్యాకేజీల రూపంలో యాంటీ వైరస్ సర్వీస్ ప్రొవైడర్లు, యాంటీ స్పైవేర్‌ను కూడా వినియోగదారులకు అందిస్తున్నాయి. 

తప్పకుండా ప్రతీ రోజు కంప్యూటర్ స్కాన్ చేయాల్సిందే: యాంటీ వైరస్  సాఫ్ట్‌వేర్ అనేది ఎంత జాగ్రత్తగా మన సిస్టమ్‌ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో అనుకోకుండాకొన్నిసార్లు కొన్ని స్పైవేర్లు మన సెక్యూరిటీ వ్యవస్థ నుండి తప్పించుకొని సిస్టమ్‌లోకి వచ్చేస్తాయి.ఈ సమస్యను తప్పించుకోవాలంటే.. ప్రతీ రోజు తప్పకుండా మీ కంప్యూటర్ స్కాన్ చేయాల్సిందే. స్కాన్ చేసినప్పుడు ఏదైనా కొత్త వైరస్ మనకు కనిపిస్తే.. దానిని డిలీట్ చేయవచ్చు. అలాగే ఆటోమెటిక్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్‌ను మీరు సిస్టమ్‌లో ఎనేబుల్ చేసుకుంటే  మంచిది. ఈ ఆప్షన్ వల్ల ఏదైనా కొత్త వెబ్ సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు.. ఒకవేళ తెలియని వైరస్ ఏదైనా సిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తే.. మనకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది.

మీడియాని కూడా స్కాన్ చేయండి: అనేకమంది యూజర్లు, వైరస్ అనేది కేవలం ఇంటర్నెట్ ద్వారానే మన సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతుందేమో అన్న అపోహలో ఉంటారు. కానీ.. ఏదైనా కొత్త మీడియాని ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా వైరస్ కంప్యూటర్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఉదాహరణకు, పెన్ డ్రైవ్‌లు, నెట్‌వర్క్ డ్రైవ్‌లు, హార్డుడిస్క్‌లు మొదలైనవి సిస్టమ్‌లోకి ఇన్సర్ట్ చేశాక, స్కాన్ చేసి, వైరస్ లేదని నిర్థారించుకున్నాకే వాటిని ఓపెన్ చేయండి.

ఈమెయిల్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త: ఈమెయిల్ ఓపెన్ చేసేటప్పుడు ఆటోమెటిక్ ఇమేజ్ ప్రివ్యూ ఆప్షన్ డిజేబుల్ చేయడం మంచిది. చాలామంది ఈమెయిల్ ఎటాచ్‌మెంట్స్ ఓపెన్ చేసేటప్పుడు అవి వైరస్ కనెక్టయిన ఈమెయిల్స్ అయితే, వాటి ద్వారా వైరస్ మన సిస్టమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో Automatic image Preview ఆప్షన్ డిజేబుల్ చేయడమే మంచిది. అలాగే వైరస్ స్కాన్ చేయకుండా.. ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి ఈమెయిల్ ఎటాచ్‌మెంట్స్ ఓపెన్ చేయడం మంచిది కాదు.

ఆటోమెటిక్ పాప్ అప్ బ్లాకర్స్ ఉండడం మంచిదే: ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు Automatic pop-up blockers సాధ్యమైనంతవరకు ఎనేబుల్ చేసి ఉంచడం మంచిదే. వీటి వల్ల మాల్వేర్ ఉండే వెబ్‌సైట్ల నుండి భద్రత ఏర్పడుతుంది

Trending News