Bamboottles Made Of Bamboo: బొంగు చికెన్ ( Bamboo Chicken ) వంటకం తిన్న వారికి ఈ స్టోరీ బాగా నచ్చుతుంది. త్రిపురా ( Tripura ) కు సమీపంలోని అగర్తాల ( Agartala ) లో స్థానికులు వెదురు బొంగుతో నీటి బాటిల్స్ ( Bamboo Bottles ) తయారచేసి అమ్ముతున్నారు. దీని కోసం వాళ్లు అడవిలో సహజసిద్ధంగా దొరికే వెదురు బొంగులను సేకరించి వాటితో బాటిల్స్ తయారు చేస్తారు. వీటికి స్థానిక మార్కెట్‌లో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఏర్పడింది.
నేను కరెక్ట్.. కంప్యూటరే రాంగ్.. శకుంతలా దేవీ ట్రైలర్
Tripura: Locals are making hand-crafted bamboo water bottles in Agartala. Avinab Kanth,In-charge at Bamboo&Crafts Development Institute says,"Presently, this is a product that has great market & demand. People are willing to buy these bottles as they are eco-friendly." (14.07.20) pic.twitter.com/ZYFz2XpmF4
— ANI (@ANI) July 15, 2020
వెదురు బొంగుతో బాటిల్స్ తయారు చేయడానికి స్థానికులు ముందు అడవిలో దొరికే బొంగులను సేకరిస్తారు. తరువాత వాటిని మంటల్లో కాల్చి బాటిల్స్ ఆకారం ( Bottle Shape ) తెస్తారు. ఇక వినియోగదారులు అభిరుచి మేరకు వాటికి రంగులు అద్దుతారు. వాటిని వివిధ డిజైన్లలో రెడీ చేసి అమ్ముతారు. కరోనావైరస్ సమయంలో వ్యాపారానికి కొంత ఇబ్బంది కలిగినా.. అది టెంపరరీ అంటున్నారు. ఆరోగ్యానికి మేలు కలిగించడంతో పాటు ఇకోఫ్రెండ్లీ (Eco- Friendly Bottle ) కావడంతో జనం కూడా వీటిని ఇష్టపడి కొంటున్నారు.
Covid-19 Vaccine: వ్యాక్సిన్ తయారీలో అమెరికా వేగం
Skill India: నైపుణ్యమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ