CM Monoharlal Khatter: రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతాట ఘనంగా జరిగాయి. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ లో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ప్రథమపౌరురాలు ద్రౌపతి ముర్ము జాతీయ పతాకం ఎగురవేశారు. అదేవిధంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఈసారి రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హజరైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా హర్యానాలో గణతంత్ర వేడుకలలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం దేశ మంతాట కూడా రామనామ స్మరణతో పులికించిపోతుంది. ఎక్కడ చూసిన కూడా అయోధ్య రామ్ లల్లా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికి చాలా మంది సామాన్య భక్తులు అయోధ్య రాముడి ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలో అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల రిపబ్లిక్ డే వేడుకలలో చిన్నారులు అయోధ్య రాముడి వేషధారణలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
कण-कण और रोम-रोम में बसे सियावर रामचंद्र की जय !
गणतंत्र दिवस समारोह के अवसर पर बाल कलाकारों द्वारा प्रभु श्रीराम जी से जुड़ी प्रस्तुति देखकर भाव विभोर हो गया तथा उनके चरण स्पर्श कर आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला।#RepublicDay2024 pic.twitter.com/QqqKMJlKWK
— Manohar Lal (@mlkhattar) January 26, 2024
దీనిలో భాగంగానే.. కర్నల్ మైదానంలో రిపబ్లిక్ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు చాలా మంది అయోధ్య లో రాముడు, లక్ష్మణులు, సీతా మాదిరి వేషధారణ వేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వారి వద్దకు వెళ్లి రాముల వేష ధారణలో ఉన్న పిల్లలకు పాదాభివందనం చేశారు.
ఈ క్రమంలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రాముడి వేష ధారణలో ఉన్న పిల్లలను చూసి భక్తితో భావోద్వేగానికి గురైనట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ''జగమంతా రామమయం, అణువణువున కూడా రాముడున్నాడంటూ ".. ఆయన ఎక్స్ వేదికగా ఈ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Read Also: Ayodhya: హనీమూన్ కోసం అయోధ్య కు వెళ్దామన్న భర్త.. కొత్త పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook