Lord Hanuman Idol Crying Video Watch Here: నిత్యం సోషల్ మీడియాలో కోట్లాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ట్రెండ్ అయ్యే వీడియోలు నెటిజన్స్ను ఎంతగానో పరిచేలా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలు చూసి నెటిజన్స్ ఇలా కూడా జరుగుతుందా అని అనుకుంటారు? ఇలాంటి షాకింగ్ కి గురి చేసే వీడియోలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిరోజు వేల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో అందర్నీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హిందువులు అయితే ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు సోషల్ మీడియాలో సాక్షాత్తు ఆంజనేయ మూర్తి కంటతడి పెట్టుకుంటున్నట్లు కొన్ని వీడియో దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కాన్పూర్ సంబంధించిన కోయిలా నగర్‌కు చెందినదిగా పోలీసులు తెలిపారు. ఇక్కడ ఉన్న ఓ హనుమాన్ మందిరంలో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయినట్లు వారు వెల్లడించారు. అయితే చాలామంది భక్తులు ఈ విషయాన్ని తెలుసుకొని దేవాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే ఇది నిజమేనా లేదా ఎవరైనా మార్నింగ్ చేసి ఉంటారా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు కూడా ఆలయాన్ని సందర్శించి పరిశీలిస్తున్నారు.
అయితే అధికారిక సమాచారం ప్రకారం మాత్రం కొంతమంది ఈ వీడియో ఫేక్ అని.. కొంతమంది కావాలనే యానిమేట్ చేశారని అంటున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి స్వయంగా హనుమంతుడు స్వయంగా ఏడుస్తున్నట్లు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశారని అంటున్నారు. అయితే ఈ వీడియోపై పూర్తిగా ఎంక్వయిరీ చేసిన పోలీసులు కూడా నిజం తేల్చేశారు. ఈ వీడియో ఉత్తిదేనని కావాలని కొంతమంది హనుమంతుడు ఏడుస్తున్నట్లు ఎడిటింగ్ చేసి పెట్టారని వారు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇలా నెటిజెన్స్ ను తప్పుదోవ పట్టించడం మంచిది కాదని పోలీసులు కూడా చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.