Viral Video today: చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం, వీడియో వైరల్

Viral Video today: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. శనివారం అందరూ చూస్తుండగానే ఓ ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 11:04 PM IST
Viral Video today: చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం, వీడియో వైరల్

Trending video today: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో(Shimla) ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ఇందులో ఉంటున్నవారు బిల్డింగ్ ను ముందుగా ఖాళీ చేసినందున ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే భవనం కూలిన చోట రహదారి దెబ్బతిన్నది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన ధామి ప్రాంతంలోని ఘండాల్ గ్రామంలో శనివారం జరిగింది. భవనం ధాటికి ధామిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారి ధ్వంసమైంది. ప్రస్తుతం దీనికి (building collapses ) సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

గత కొన్ని రోజులుగా ధామిలో తవ్వకం పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బిల్డింగ్‌ పక్కనే ఉన్న రహదారిలో పగుళ్లు వచ్చాయి. దాంతోపాటు డిగ్రీ కళాశాల సమీపంలోని బిల్డింగ్‌లో కూడా పగుళ్లు ఏర్పడ్డాయి.  దీంతో అందులో ఉంటున్న లా కాలేజీ విద్యార్థులను వారం రోజుల కిందట ఖాళీ చేయించారు అధికారులు. అంతేకాకుండా ఆ భవనానికి విద్యుత్‌ కనెక్షన్లు తొలగించారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ బిల్డింగ్‌ కూలిపోయింది. ముందస్తు చర్యల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. గతంలో కూడా ఇళ్లు కూలిపోయిన వీడియోలు చాలానే నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

Also Read: Gas Delivery Boy: జాక్‌పాట్‌ కొట్టిన గ్యాస్‌ డెలివరీ బాయ్‌.. 49తో రూ.కోటిన్నర గెలిచాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News