Two Died after JCB Tyre Exploded: చత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జేసీబీ టైరులో గాలి నింపుతున్న క్రమంలో ఒక్కసారిగా అది భారీ శబ్ధంతో పేలిపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రాయ్‌పూర్‌లోని సిల్తారా ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న ఓ గ్యారేజ్‌లో ఈ ఘటన జరిగింది. మంగళవారం (మే 2) తెల్లవారుజామున 3.3గం. సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోను గమనిస్తే... గ్యారేజ్‌లో ఓ వ్యక్తి జేసీబీ టైరులో గాలి నింపుతున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న వ్యక్తి వచ్చి టైరుపై రెండు చేతులు పెట్టి గట్టిగా ప్రెస్ చేశాడు. అంతే.. ప్రెజర్ ఎక్కువవడంతో టైరు ఒక్కసారిగా పేలిపోయింది. టైరులో గాలి నింపుతున్న వ్యక్తితో పాటు దాన్ని బలంగా ప్రెస్ చేసిన వ్యక్తి.. ఇద్దరూ ఎగిరిపడ్డారు. ఆ ప్రదేశమంతా పొగతో నిండిపోయింది.
తీవ్ర గాయాలవడంతో ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్‌కి చెందినవారిగా గుర్తించారు. బతుకుదెరువు కోసం వారు రాయ్‌పూర్‌కి వచ్చి సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలోని గ్యారేజ్‌లో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. టైరులో ఎయిర్ క్వాంటిటీని చెక్ చేసేందుకే ఆ వ్యక్తి రెండు చేతులతో దాన్ని బలంగా ప్రెస్ చేశాడని... ఈ క్రమంలో అనుకోకుండా అది ఒక్కసారిగా పేలిపోయిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారమిచ్చామని... వారు రాయ్‌పూర్ వచ్చాక మృతదేహాలను అప్పగిస్తామని తెలిపారు.
Caught on Camera: 2 Killed After JCB Tyre Explodes While Air Being Refilled
(Trigger Warning: Visuals Are Disturbing) pic.twitter.com/PnRu9xEDvZ— India.com (@indiacom) May 5, 2022
గుజరాత్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ :
గుజరాత్‌లోని సూరత్‌లోనూ ఛత్తీస్‌గఢ్ తరహా ఘటన చోటు చేసుకుంది. సూరత్ మున్సిపాలిటీలోని డంప్ యార్డులో శైలేష్ అనే శానిటైజ్ వర్కర్ జేసీబీ టైరులో గాలి నింపుతుండగా.. అది ఒక్కసారిగా పేలిపోయింది. టైరు మెటల్ అతనికి బలంగా తాకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీని లాగి కొట్టిన చెన్నై బౌలర్.. సీన్ కట్ చేస్తే..!
Also Read: Twin Murders: జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు... చంపింది ఆమె భర్తే.. 30కి.మీ వెంబడించి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.