Viral Video: కరోనా టెస్టును నిరాకరించిన మహిళ.. నేలపై పడుకోబెట్టి మరీ చేశారు..!

Woman Pinned Down For COVID Test in China. వారంలో మూడుసార్లు కరోనా టెస్ట్ చేసుకోవడం ఇబ్బందిలా ఫీల్ అయిన ఓ చైనీస్ మహిళ.. టెస్ట్ చేసుకునేందుకు నిరాకరించింది. ఆరోగ్య కార్యకర్తలు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేసినా.. ఆమె ససేమిరా అంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 05:59 PM IST
  • కరోనా టెస్టును నిరాకరించిన మహిళ
  • నేలపై పడుకోబెట్టి మరీ కరోనా టెస్టు చేశారు
  • ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్
Viral Video: కరోనా టెస్టును నిరాకరించిన మహిళ.. నేలపై పడుకోబెట్టి మరీ చేశారు..!

Google Trend Video, Woman refused COVID 19 Test in China: కరోనా వైరస్ మహమ్మారి పుట్టిల్లు చైనాలో గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య న‌గ‌ర‌మైన చాంగ్‌చున్‌లో కొత్తరకం వైరస్ కేసులు భారీగా బయటపడటంతో కలకలం రేగింది. దీంతో షాంఘై, బీజింగ్ లాంటి ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. బీజింగ్ హై అలర్ట్‌లో ఉంది. అక్కడ రెస్టారెంట్లు, బార్‌లు, జిమ్‌లు మరియు విద్యాసంస్థలు నిరవధికంగా మూతపడ్డాయి. స్థానికులు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దని, కుటుంబంలో ఒక‌రే నిత్యావ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వెళ్లాలని రూల్స్ ఉన్నాయి.

కొత్త కేసులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్న చైనా అధికారులు బీజింగ్ సిటీలో కరోనా టెస్టులను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అక్కడి నివాసితులు వారంలో మూడు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే 48 గంటల్లో చేయించుకున్న కరోనా టెస్ట్ ఫలితం నెగటివ్ అయి ఉండాలి. అయితే గురువారం బీజింగ్ నగరంలో 50 కొత్త కేసులను అక్కడి అధికారులు గుర్తించారు. అందులో ఎనిమిది మందికి లక్షణాలు లేవట. 

వారంలో మూడుసార్లు కరోనా టెస్ట్ చేసుకోవడం ఇబ్బందిలా ఫీల్ అయిన ఓ చైనీస్ మహిళ.. టెస్ట్ చేసుకునేందుకు నిరాకరించింది. ఆరోగ్య కార్యకర్తలు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేసినా.. ఆమె ససేమిరా అంది. దాంతో ఆరోగ్య కార్యకర్తలు ఆమెకు బలవంతంగా టెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె కిందపడిపోయింది. గట్టిగా అరుస్తున్నా వదలని ఇద్దరు కార్యకర్తలు సదరు మహిళ చేతులను మోకాళ్ల కిందకి లాగి ముక్కులోంచి నమూనాలను తీసుకున్నారు. 

ఈ ఘటన అంతా కరోనా పరీక్షా కేంద్రం వద్దనే జరగడం విశేషం. ఆరోగ్య కార్యకర్తలు ఆమెకు బలవంతంగా టెస్ట్ చేయడాన్ని చూసిన అక్కడున్న వారు సరదాగా నవ్వుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. చైనాకు చెందిన ఓ యూజర్ వీడియోను పోస్ట్ చేసి.. రెడ్ ఎమోజీలను జత చేశాడు. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓసారి చూడండి. 

Also Read: Remedies for Rahu: రాహు దోషంతో బాధపడుతున్నారా.. నివారణకు ఇదొక్కటే మార్గం!

Also Read: Rare Video: అద్భుతం.. మేఘాలను తాకుతున్న అలలు.. వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News