Chicken flying in air and cross the River: సాధారణంగా కోడి నేల మీద తిరుగుతుంటుందని అందరికి తెలిసిన విషయమే. కోళ్లకు పక్షి లాగానే రెక్కలు ఉన్నా.. తక్కువ ఎత్తులో, తక్కువ సమయం వరకు ఎగురుతాయి. డేగ లేదా కాకి వచ్చి తమ పిల్లలను ఎత్తుకెళ్లే సమయంలో వాటితో పోరాడడానికి కాస్త ఎక్కువ ఎత్తుకు ఎగిరి తరిమివేస్తాయి. ఆ సమయంలో మాత్రమే కోళ్లు ఎక్కువ సమయం గాల్లో ఉంటాయి. కానీ ఓ కోడి మాత్రం ఏకంగా చిన్నపాటి నదినే దాటేసింది.
ఓ అడవిలోని చిన్నపాటి నది ఉండగా... దాని ఒడ్డున ఓ 10-15 కోళ్ల గుంపు ఉంది. రోడ్డు మీద ఆ గంపు ఆహరం వేటలో ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ఆ గుంపులోని ఓ కోడి ఎగురుతూ నదిని దాటింది. నది ఒక చివర నుంచి మరో చివరకు ఆ కోడి ఎగురుకుంటూ వెళ్లింది. అటు వైపు వెళ్లిన కోడి అక్కడ ఆహరం తింటూ కనబడింది. అక్కడ వాటి గూడు ఉండడం వీడియోలో చూడొచ్చు. అంటే.. ప్రతిరోజు అవి ఆ చిన్న నదిని దాటుతాయని అర్ధమవుతోంది.
ఇందుకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'అమేజింగ్ నేచర్' అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 'ఇది నిజంగా అద్భుతం' అని కాప్షన్ కూడా ఇచ్చారు. గాల్లో ఎగురుతూ నదిని దాటిన కోడిని అందరూ నోరెళ్లబెడుతున్నారు. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి 5 వేలకు పైగా లైకులు, వెయ్యికి పైగా రీ ట్వీట్లు వచ్చాయి. 'కోడి పక్షిలా పుట్టి ఉంటుంది', 'ఈ కోడి మిస్ అయి ఇలా పుట్టింది', 'ఇదేందయ్యో ఇది.. నేనెప్పుడూ చూడలే' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆలస్యం ఎందుకు మీరూ ఓసారి చూసేయండి.
This is Amazing pic.twitter.com/8Syzdw6BnP
— Amazing Nature (@AmazingNature00) February 24, 2022
గతంలో కూడా ఓ కోడి పక్షిలా చక్కర్లు కొట్టి అందరిని ఆశ్చర్యానికి గూగురిచేసింది. ఓ మంచు ప్రాంతంలోని కోడి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగురుతూ పోయింది. దాదాపు 40 సెకన్ల పాటు వందల మీటర్ల వరకూ గాల్లోనే ఉంది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. 'ఓ కోడి ఇంత దూరం విహరిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు' అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవలే ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది.
Also Read: IND Vs SL: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 మ్యాచ్ అనుమానమే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook