Funny Shoplifting: దొంగతనానికి వచ్చి షాపును కాపాడారు

Tredning Video: నేటి సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా అది వెంటనే ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, డాటా అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇప్పుడు మరిన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి. 

Last Updated : Nov 16, 2020, 05:21 PM IST
    1. నేటి సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా అది వెంటనే ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతుంది.
    2. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, డాటా అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇప్పుడు మరిన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి.
    3. ఈ వీడియోనే చూడండి. ఇది ఎక్కడో విదేశాల్లో సీసీటీవీలో రికార్డు అయినా వీడియో..కానీ మన దేశంలో కూడా ఇది బాగా చెలామణి అవుతోంది.
Funny Shoplifting: దొంగతనానికి వచ్చి షాపును కాపాడారు

Funny Viral Video: నేటి సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా అది వెంటనే ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, డాటా అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇప్పుడు మరిన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి. ఈ వీడియోనే చూడండి. ఇది ఎక్కడో విదేశాల్లో సీసీటీవీలో రికార్డు అయినా వీడియో..కానీ మన దేశంలో కూడా ఇది బాగా చెలామణి అవుతోంది.

Also Read | 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట

44 సెకన్ల ఈ వైరల్ వీడియోను ( Viral Video) చూసిన తరువాత దొంగల మంచితనాన్నిపొగుడుతున్నారు నెటిజెన్స్ ( Netizens ). ఈ ట్రెండింగ్ వీడియోలో ఇద్దర వ్యక్తులు సూపర్ మార్కెట్లో దొంగతనం చేయడానికి వెళ్తారు. ఒకతన బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్యాషియర్ ను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తోంటే.. ఇంకో వ్యక్తి బ్యాగులో సరుకులు నింపుతుంటాడు. అంతలోనే మరో దొంగ చేతిలో గన్ను తీసుకుని స్టోర్ లోకి ప్రవేశిస్తాడు. అది చూసి ఇద్దరు దొంగలూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

అయితే రాక్స్ వెనక దాక్కోవడానికి వెళ్లిన వారికి గన్ను ఉన్న దొంగను నిలువరించే అవకాశం కనిపిస్తుంది. వెంటనే వెనక నుంచి ఒకతను వచ్చి దొంగను ముందుకు నెట్టేస్తాడు. రెండో అతను దొంగపై రాక్స తోస్తాడు. అంతే దొంగ కింద పడిపోతాడు. వెంటనే అతని చేతిలోంచి గన్నును లాక్కుని స్టోర్ యజమాని చేతిలో పెట్టి పారిపోతారు పాత దొంగలు.

Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు

ఈ వీడియోను మీరు కూడా చూడండి..
 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News