Viral Video Of Rahul Gandhi playing badminton: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోకు జత చేసిన కామెంట్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఓ ఇండోర్ కోర్టులో చుట్టూ కొంతమంది పార్టీ నాయకులు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చూస్తూ ఉండగా రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది.
వైరల్ అవుతున్నది ఏంటి?
ఐదు రాష్ట్రాల్లో ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అవమానాన్ని ఎదుర్కొందని, ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడారని ఈ వీడియోను షేర్ చేసిన ఓ ఫేస్‌బుక్ పేజీలో కనిపించిది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఈ వీడియోను పోస్ట్ చేసి.. రిజల్ట్‌వచ్చిన తర్వాతే రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడారని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఘోర పరాభవం ఎదురయ్యింది. అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సమయంలోనే రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం విమర్శలకు దారితీసింది.
జీ తెలుగు న్యూస్ ఫ్యాక్ట్ చెక్ :
జీ తెలుగు బృందం ఈ పోస్ట్ నిజమేనా అన్న కోణంలో ఆన్‌లైన్‌లో కీవర్డ్స్‌తో సెర్చ్ చేసింది. అలాగే, ఇన్‌విడ్ టూల్ సాయంతో స్క్రీన్‌షాట్లు సేకరించి వాస్తవమేంటో తెలుసుకుంది. ఈ వీడియో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒకరోజు ముందు రికార్డయ్యింది. ఫలితాలు వచ్చిన తర్వాత రాహుల్‌గాంధీ బ్యాడ్మింటన్ ఆడలేదు.
వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒకరోజు ముందు.. అంటే మార్చి 9వ తేదీన రాహుల్ గాంధీ మలప్పురంలోని ఓ కాలేజీకి వెళ్లి అక్కడ కొత్త ఇండోర్ స్టేడియంలో కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. అదే రోజు ఆ దృశ్యాలను రాహుల్ గాంధీ తన అధికారిక యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.
అంతేకాదు.. ఆలిండియా కాంగ్రెస్ అధికారిక యూట్యూబ్ పేజీలోనూ ఇదే వీడియో మార్చి 9వ తేదీన అప్‌లోడ్ అయ్యింది.
ప్రచారం : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతూ సేదదీరారు.
వాస్తవం : ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒకరోజు ముందు రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్యాడ్మింటన్ ఆడిన వీడియో ఇది. కాబట్టి వైరల్ అవుతున్న ప్రచారం అవాస్తవం.
Also read : Gang War Video: రోడ్డు మధ్యలో యువతుల 'గ్యాంగ్ వార్'- తీరిగ్గా చూస్తున్న జనం!
Also read : Accident Viral Video: హెల్మెట్ వల్ల ఎంత ఉపయోగం ఉందో ఈ వీడియో చూసి తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook