Elephant Security: బుల్లి ఏనుగుకు Z+++ సెక్యూరిటీ.. బహుశా పీఎంకు కూడా ఇంత సెక్యూరిటీ ఉండదేమో!

Elephants Providing Z+++ Security for Baby elephant. బుల్లి ఏనుగును కాపాడేందుకు మిగతా ఏనుగులు చేసిన పనిని అందరూ ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 23, 2022, 03:03 PM IST
  • బుల్లి ఏనుగుకు Z+++ సెక్యూరిటీ
  • అత్యంత భ‌ద్ర‌త మధ్య చిన్ని ఏనుగు
  • పీఎంకు కూడా ఇంత సెక్యూరిటీ ఉండదేమో
Elephant Security: బుల్లి ఏనుగుకు Z+++ సెక్యూరిటీ.. బహుశా పీఎంకు కూడా ఇంత సెక్యూరిటీ ఉండదేమో!

Elephants Providing Z+++ Security for Baby elephant: ప్రస్తుత ప్రపంచంలో కొంతమంది కన్న పిల్లలు అని కూడా చూడకుండా చంపడమే కాకూండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. జంతువులు మాత్రం తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడనుకుంటున్నాయి. ఎవరైనా పిల్లల జోలికి వస్తే.. తమ ప్రాణాలను సైతం లెక్కచేయవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. బుల్లి ఏనుగును కాపాడేందుకు మిగతా ఏనుగులు చేసిన పనిని అందరూ ఫిదా అవుతున్నారు. 

వీడియో ప్రకారం... రోడ్డుపై నుంచి బుల్లి ఏనుగును అడవిలోకి తీసుకెళ్తున్న స‌మ‌యంలో దానికి ఎలాంటి హానీ జ‌ర‌గ‌కుండా.. పెద్ద ఏనుగులు అన్ని చుట్టూ చేరాయి. బుల్లి ఏనుగును మ‌ధ్య‌లో ఉంచి పెద్ద ఏనుగులు రోడ్డుపై నడిచాయి. అత్యంత భ‌ద్ర‌త మధ్య చిన్ని ఏనుగు రోడ్డుపై దర్జాగా న‌డుస్తూ వెళ్లింది. ఇక అడవిలోకి వెళ్లే మార్గం రాగానే.. చిన్ని ఏనుగును ఆ దారిలోకి తీసుకెళ్ళాయి. ఆపై పెద్ద  ఏనుగులు వెనకాల నడవసాగాయి. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు కోయంబ‌త్తూరులోని సత్యమంగళంలో చోటు చేసుకున్నట్లు సమాచారం. 

ఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. 'బుల్లి ఏనుగుకు ఏనుగుల గుంపు ఇంత‌గా భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నాయి. ప్ర‌పంచంలో ఇంత‌క‌న్నా భ‌ద్ర‌త ఎవ్వ‌రూ ఇవ్వ‌లేరు' అని పేర్కొన్నారు. ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైర‌ల్ అయింది. వీడియో చూసిన అందరూ ఫిదా అవుతున్నారు. 'మనుషుల కంటే జంతువులే మేలు', 'బహుశా పీఎంకు కూడా ఇంత సెక్యూరిటీ ఉండదేమో' అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి దాదాపు 1,500 రీట్వీట్‌లు, 9000 లైక్‌లు మరియు 381000 వ్యూస్ వచ్చాయి. 

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్ ఆఫర్.. రూ.1000కే POCO M4 Pro మొబైల్ మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్  
Also Read: Sprouts for Diabetes: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే ఇది మీ కోసమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News