విద్య ( Education ) అంటేనే ఇప్పుడు అన్నింటికంటే లాభసాటి వ్యాపారం అయిపోయింది. తమ పిల్లలకు మంచి భవిష్యత్‌ని అందించాలంటే ప్రీ స్కూలింగ్ ( Pre-school) నుంచే వేలకు వేల రూపాయలు స్కూల్ ఫీజు ( School fee ) కుమ్మరించాల్సిన దుస్థితి. ఇటీవల కాలంలో పిల్లల విషయంలో అతి ఖరీదైనది ఏదైనా ఉందా అంటే అది వారికి విద్యను అందించడమే అనేది జగమెరిగిన సత్యం. అలాంటి ఈ రోజుల్లోనూ ఒక మహానుభావుడు ఒక్క పైసా ఫీజు లేకుండానే తమ ప్రాంతంలోని బాలబాలికలకు ఉచితంగా విద్యను ( Free education ) అందిస్తున్నారు. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 ఏళ్లుగా ఆయన అదే పనిగా పెట్టుకున్నారు. చెట్టు కిందే బడి నడిపిస్తున్న ఈ పెద్దాయనది ఎంత గొప్ప మనసంటే.. '' ప్రభుత్వం నుంచి సహాయం అందించి స్కూల్ నిర్మిస్తాం.. అందులో హాయిగా పిల్లలకు బడి చెప్పండి మాస్టారూ'' అని ఆ ఊరి సర్పంచ్ అడిగితే.. ''నేను ఎవ్వరి సహాయం ఆశించి ఈ పనిచేయడం లేదు.. నాకిదే హాయిగా ఉంది'' అని అంటున్నారాయన. Also read : Naegleria fowleri infection: నల్లా నీళ్లలో మెదడును తినే ప్రాణాంతకమైన సూక్ష్మ జీవి
ఇంతకీ ఈ చెట్టుకింద బడి ఎక్కడ ? ఈ మాస్టారుది ఏ ఊరు అనే కదా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. ఈ పెద్దాయనది ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లా సుకిందకు సమీపంలోని బర్తండ గ్రామం. పేరు నంద ప్రస్తి. మారుమూల గ్రామాల్లో పొలం పనులు చేసుకునే కూలీలకు అక్ష్యరాస్యత లేకపోవడం తనని బాధించిందని, వారికి కనీసం సంతకం పెట్టేంత చదువైనా చెప్పాలనే ఉద్దేశంతో వారికి విద్య నేర్పడం మొదలుపెట్టానని నంద ప్రస్తి తెలిపారు. కానీ తన వద్ద చదువు నేర్చుకోవడానికి వచ్చిన వారిలో చాలా మంది మంచి చదువు నేర్చుకుని భగవద్గీత ( Bhagavad Gita ) కూడా చదివే స్థాయికి చేరుకున్నారని అన్నారు.
Odisha: An aged man in Jajpur teaches children under a tree for free.
Bartanda sarpanch says, "He has been teaching from the last 75 yrs. Refuses any support from govt as it's his passion. But we've decided to build a facility where he can teach children in comfort." (26.09.20) pic.twitter.com/kSYOAkFvss
— ANI (@ANI) September 27, 2020
తన వద్ద చదువుకున్న మొదటి బ్యాచ్ విద్యార్థుల మునిమనవళ్లు, మునిమనవరాళ్లకు కూడా ప్రస్తుతం తానే చదువు చెబుతున్నానని గర్వంగా చెప్పుకునే మాస్టారు.. వారికి చదువు చెప్పడంలో పొందే ఆనందం కంటే వారి నుంచి ఎక్కువ పైసా కూడా ఆశించనని చెప్పడం విశేషం. 4వ తరగత వరకు ఉచిత విద్య అందించే మాస్టారు.. ఆ పై తరగతులకు వారిని ప్రాథమిక పాఠశాలకు పంపించాల్సిందిగా వారి తల్లిదండ్రులకు సూచిస్తుంటారు. ఇప్పటికీ రాత్రిపూట వయోజనులకు కూడా ఉచితంగానే చదువు చెప్పే ఆ మాస్టారు ఓపికకు, ఆయన గొప్పతనానికి సలాం చేయకుండా ఉండలేం. Also read : Sourav Ganguly, Ind vs Eng: భారత్‌లోనే ఇండియా vs ఇంగ్లాండ్
మండు వేసవిలోనైనా, వర్షాకాలం అయినా, చలి కాలంలోనైనా.. మాస్టారు చదువు చెప్పడం ఆపలేదు. ఇప్పుడు ఆయనకు వయసైపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య చదువు చెప్పడం ఆయనకు కష్టంగానే ఉంటోంది. అందుకే ఆయన ఎంత వద్దంటున్నా.. గ్రామస్తులమే ఆయనకు ఓ పాఠశాల నిర్మించి ఇవ్వాలని అనుకుంటున్నామని బర్తండ సర్పంచ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe