Delivery Agent Eats Customer's Food: సమయం లేకపోవడం వల్లో లేక ఓపిక లేకపోవడం వల్లో లేదంటే అందుబాటులో ఫుడ్ స్టోర్స్ లేకపోవడం వల్లో.. ఇలా కారణాలు ఏవైనా ఫుడ్ డెలివరి యాప్స్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఫుడ్ డెలివరి యాప్స్ సైతం పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా కస్టమర్ బేస్ పెంచుకుని లాభాల బాటలో ప్రయాణించాలనేది ఫుడ్ యాప్స్ ఆలోచన.
మరోవైపు అదే సమయంలో ఫుడ్ డెలివరి యాప్స్ కస్టమర్లకు అవసరానికి ఫుడ్ ఎలాగైతే డెలివరీ చేస్తుందో అలాగే.. ఉపాధి రూపంలో ఎంతోమంది ఫుడ్ డెలివరి ఏజెంట్స్ కి సైతం నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు అవకాశం కల్పిస్తూ వారి ఆకలి తీరుస్తోంది. ఫుడ్ డెలివరి ఏజెంట్స్ లో కొంతమంది పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ మిగతా సమయంలో రోజువారి ఖర్చుల కోసం ఫుడ్ డెలివరి ఏజెంట్ గా పనిచేస్తున్న వారు కాగా ఇంకొంతమంది ఫుల్ టైమ్ ఇదే జాబ్ చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఈ మొత్తం క్రమంలో కొంతమంది కస్టమర్స్ తమ వద్దకు వచ్చే ఫుడ్ డెలివరి ఏజెంట్స్‌ని సాటి మనిషిగా గౌరవించి ఆదరించే వాళ్లు ఉన్నారు, ఇంకొంతమంది చిన్నచూపు చూస్తూ చిన్న చిన్న కారణాలకే చీదరించుకునే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఫుడ్ డెలివరి ఏజెంట్స్ మాత్రం కస్టమర్స్ పట్ల మర్యాదగా, ఓపికగా వ్యవహరించే వారే ఎక్కువ. ఎందుకంటే కస్టమర్స్ తమ గురించి ఫుడ్ డెలివరి యాప్ నిర్వాహకులకు ఏమైనా రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తే... అది వారికి లభించే కమిషన్, ఇతర ఇన్సెంటీవ్స్‌లో కోతకు కారణం అవతుంది అనేది వారి భయం.
కస్టమర్స్‌తో గొడవ పడితే.. అది తమకే ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొస్తుంది అనే అభద్రతా భావం, ఆందోళన చాలామంది ఫుడ్ డెలివరి ఏజెంట్స్ స్పష్టంగా కనిపిస్తుండటం బాధాకరం. అందుకే తమకు నచ్చినా, నచ్చకపోయినా.. నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కోసం కొన్నిసార్లు అవమానాలను సైతం దిగమింగుకుని పనిచేసుకుపోతుంటారు. కానీ తాజాగా ఒక ఫుడ్ డెలివరి ఏజెంట్ మాత్రం కస్టమర్ కే కౌంటర్ ఇచ్చాడు.
కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్‌ని అతడికి డెలివరి చేయకుండా ఆ ఫుడ్‌ని తిన్న ఫుడ్ డెలివరి బాయ్.. తన తప్పును అంగీకరించకుండా కస్టమర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహం చెందిన కస్టమర్.. నువ్వు అసలు మా ఇంటికే రాలేదు అని చెప్పడానికి తమ వద్ద సీసీటీవీ కెమెరా సాక్ష్యం ఉందని.. ఈ విషయం ఫిర్యాదు చేస్తే నీ ఉద్యోగం పోతుంది అన్నట్టుగా మందలించాడు. అయితే, కస్టమర్ మాటలతో అప్పటికి కూడా కన్విన్స్ కాని ఫుడ్ డెలివరి ఏజెంట్.. " నీ పిల్లల ఆకలి తీర్చడానికి వెళ్లి ఫుడ్ తీసుకొచ్చుకోలేని సోమరిపోతువి నువ్వు " అంటూ కస్టమర్‌తో దుర్భాషలాడాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది.
ఇది కూడా చదవండి : PVR Cuts Snacks Prices: జర్నలిస్ట్ ట్వీట్ దెబ్బకి దిగొచ్చిన పీవీఆర్ యాజమాన్యం.. ఇక అన్‌లిమిటెడ్ పాప్‌కార్న్, అన్‌లిమిటెడ్ డ్రింక్స్
ఇదంతా కూడా కస్టమర్‌కి, ఫుడ్ డెలివరి ఏజెంట్‌కి మధ్య చాటింగ్ రూపంలో జరిగింది. దీంతో బాధిత కస్టమర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఫుడ్ డెలివరి ఏజెంట్‌గా కస్టమర్‌కి ఫుడ్ డెలివరి చేయడం అతడి డ్యూటీ. ఆ పని చేయకపోగా కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తినడమే కాకుండా తిరిగి ఏ ధైర్యంతో కస్టమర్‌కి ఎదురు తిరుగుతున్నాడు అంటూ సాటి నెటిజెన్స్ అతడికి అండగా నిలిచారు. అయితే, ఇంకొంతమంది నెటిజెన్స్ మాత్రం ఫుడ్ డెలివరి బాయ్ పక్షాన్నే నిలిచారు. " ఇంతమాత్రానికే అతడి ఉద్యోగం పోయేలా చేయడం సరికాదు " అంటూ కస్టమర్‌కి వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టిన వాళ్లు కూడా లేకపోలేదు. భారీ సంఖ్యలో నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Cyber Frauds: హలో, మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తున్నాయా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK