1 Acre Land Bought On Moon: తల్లి మీద ప్రేమతో చంద్రుడిపై ఎకరం స్థలం గిఫ్టుగా ఇచ్చిన కుమార్తె

Daughter Purchased 1 Acre Land On Moon For Mother: తల్లి మీద ఉన్న ప్రేమతో ఓ కూతురు ఏకంగా చంద్ర మండలం పైనే ఎకరం భూమిని కొనుగోలు చేసింది. అక్కడికి వెళ్లలేమని తెలిసినా కూడా చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన తల్లిపై మమకారంతో చంద్రుడిపై భూమిని కొని రిజిస్ట్రేషన్ చేయించి, మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2023, 05:39 AM IST
1 Acre Land Bought On Moon: తల్లి మీద ప్రేమతో చంద్రుడిపై ఎకరం స్థలం గిఫ్టుగా ఇచ్చిన కుమార్తె

Daughter Purchased 1 Acre Land On Moon For Mother: తల్లి మీద ఉన్న ప్రేమతో ఓ కూతురు ఏకంగా చంద్ర మండలం పైనే ఎకరం భూమిని కొనుగోలు చేసింది. అక్కడికి వెళ్లలేమని తెలిసినా కూడా చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన తల్లిపై మమకారంతో చంద్రుడిపై భూమిని కొని రిజిస్ట్రేషన్ చేయించి, మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్ ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్ధాల రాంచందర్‌ - వకుళా దేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

పెద్ద కూతురు సుద్దాల సాయి విజ్ఞత పదేళ్ళ క్రితం అమెరికాలో స్థిరపడింది. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్‌ కిమ్‌ రెనాల్స్‌ వద్ద ప్రాజెక్టు మేనేజర్‌, ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌గా పని చేస్తోంది. తన కార్యాలయంలో చంద్రుడిపై భూమి కొనుగోలుపై చర్చ జరుగగా స్పందించిన సాయి విజ్ఞత తాను తన తల్లికి బహుమతిగా చంద్రుడిపై భూమి కొనివ్వాలని నిర్ణయించుకుంది. మదర్స్ డే సందర్బంగా 2022 మార్చి 8న చంద్రుడిపై భూమి కొనుగోలుకు లూనార్‌ రిజిస్టేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఈ నెల 23న తన తల్లి వకుళా దేవి, మనుమరాలు ఆర్త సుద్దాల పేరున రిజిస్ట్రేషన్ చేయించింది. 

స్వదేశంలో చంద్రయాన్‌ -3 విజయవంతం అయిన రోజునే రిజిస్టేషన్‌ పత్రాలు చేతికి అందడంతో ఈ ఘటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు చంద్రయాన్ -3 సక్సెస్ అవడం.. మరోవైపు అదే రోజున తనకు చంద్ర మండలంపై కొన్న ప్లాట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చేతికి అందడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని సాయి విజ్ఞత చెబుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News