Dangerous Snake Rescue Video: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన మురళీవాలే హౌస్లా అనే వ్యక్తి డేరింగ్ స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత డేంజరస్ స్నేక్ అయినా.. ఎంత డేంజరస్ పరిస్థితుల్లోనైనా మురళీ చాలా సులువుగా స్నేక్స్‌ని పట్టుకోగలడు. మురళీకి సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్ నిండా స్నేక్ క్యాచింగ్ వీడియోలు, ఇతర విషపూరిత జంతువుల వీడియోలే ఉంటాయి. అందులో అత్యంత డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ వీడియోని ఇప్పుడు మనం చూడబోతున్నాం..
మురళీవాలే హౌస్లా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న ఆ వీడియోను గమనిస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ జిల్లాలో ఉన్న ఓ గ్రామానికి అతను వెళ్లాడు. అక్కడి పంట పొలాల నడుమ ఉన్న ఓ ఎండిపోయిన బావిలో చాలాకాలంగా ఆరు విషపూరిత పాములు ఉంటున్నాయి. ఆ పాములను పట్టుకునేందుకే మురళీ అక్కడికి వెళ్లాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులంతా ఆ బావి చుట్టూ గుమిగూడారు.
ఆ బావిలోకి దిగి వాటిని పట్టుకోవడం మామూలు విషయం కాదు. ఆ బావి మధ్యలో భారీ వృక్షం కూడా ఉంది. ఏమైనా జరిగితే వెంటనే పైకి చేరుకోవడం కూడా కష్టం. అయినప్పటికీ ఏమాత్రం జంకు, భయం లేకుండా మురళీ హౌస్లా బావిలోకి దిగాడు. ఒక నిచ్చెన సాయంతో అతను, అతని కెమెరామెన్ లోపల దిగిపోయారు. లోపలికెళ్లాక బావి చుట్టూ అక్కడక్కడా మొత్తం ఆరు పాములు కనిపించాయి. ఇందులో రెండు కింగ్ కోబ్రా, రెండు రక్త పింజర, మరో రెండు ఇతర విషపూరిత పాములు ఉన్నాయి.
లోపలికి దిగడమే ఆలస్యం మురళీ హౌస్లా తన పని మొదలుపెట్టాడు. స్నేక్ క్యాచింగ్ స్టిక్ సాయంతో ఒక్కో పామును చాలా సులువుగా పట్టేశాడు. పట్టిన పామును పట్టినట్లు చాకచక్యంగా సంచుల్లో బంధించేశాడు. కొన్ని పాములను చేయితో గట్టిగా తల వద్ద పట్టుకుని వాటి నోరు తెరిచి చూపించాడు. అలా మొత్తం ఆరు పాములను సంచుల్లో బంధించాడు. ఇంత చేసి.. చివరలో తాను 'బచ్చా'నే అని మురళీ చెప్పడం గమనార్హం. స్నాక్ క్యాచింగ్‌లో తనకన్నా గొప్పవారు ఉన్నారని అతను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Amit Sha Meets Jr Ntr: బిగ్ బ్రేకింగ్: అమిత్ షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్..పొలిటికల్ రీ ఎంట్రీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook