China Woman Drops Newborn in Rubbish Bin: ఓ మహిళ లిఫ్ట్‌లోనే ప్రసవించింది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ పసికందుకు చెత్త కుండీలో పాడేసి వెళ్లిపోయింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకోగా.. సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. వివరాలు ఇలా.. గుర్తుతెలియన ఓ మహిళ నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలో విహారయాత్రం కోసం వచ్చింది. ఆగస్టు 21న సూట్‌కేస్‌తో లిఫ్ట్‌లోకి ఆమె ప్రవేశించింది. లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఓ మూలన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత నవజాతి శిశువుపై రక్తం మరకలు శుభ్రం చేసింది. లిఫ్ట్‌లో నేలపై ఉన్న మరకలను టిష్యూతో తొలగించింది. దీంతో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. అనంతరం పసికందును డస్ట్‌బిన్‌లో పాడేసింది.
తన బిడ్డ డస్ట్‌బిన్‌లో ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదని పైన టిష్యూ పేపర్‌ను అంటించింది. ఈ సంఘటన ఆగస్టు 21వ తేదీ రాత్రి 8.44 గంటలకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో లిఫ్ట్ కెమెరా, బిల్డింగ్ కెమెరాల్లో రికార్డు అయింది. మహిళ లిఫ్ట్‌లోకి దిగి చిన్నారిని డస్ట్‌బిన్‌లో పడేయడం కనిపిస్తోంది. రాత్రి 8.47 గంటలకు లిఫ్ట్ ఆగిపోవడంతో ఆ మహిళ తన బిడ్డతో బయటకు పరుగెత్తింది. తరువాత తన బిడ్డను లిఫ్ట్ లాబీలోని డస్ట్‌బిన్‌లో పాడేసి.. టిష్యూ పేపర్‌ను కప్పింది. తన ఆమె షూస్‌పై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసుకుని మరో లిఫ్ట్‌ని ఉపయోగించి లాబీ నుంచి వెళ్లిపోయింది.
డస్ట్‌బిన్‌లో పడి ఉన్న పసికందను రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో నివసిస్తున్న కొందరు గమనించారు. వెంటనే పోలీసులకు సమచారం అందించగా.. వారు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉంది. చిన్నారిని తల్లి ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిందని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ఎందుకు ఇలా చేసిందో ఆరా తీస్తున్నారు. పాప క్షేమంగా ఉందని జిల్లా పోలీసులు తెలిపారు. అయితే గోప్యతా సమస్యల కారణంగా వారు మరిన్ని వివరాలను వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఆ మహిళపై తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె మృగం కంటే హీనంగా ప్రవర్తించిందని మండిపడుతున్నారు. ఇలాంటి బాధ్యత లేని తల్లిదండ్రులు.. శిశువును తీసుకెళ్లినా దురదృష్టకరమేనని అంటున్నారు.
Also Read: Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook