Child Stuck In Lift Cctv Video: గ్రేటర్ నోయిడాలోని నిరాలా ఆస్పైర్ సొసైటీ లిఫ్ట్‌లో చిన్నారి ఇరుక్కున్న సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 14వ అంతస్తు నుంచి ఇంటికి వెళ్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి నాలుగో, ఐదో అంతస్తు మధ్య దాదాపు 10 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోవడంతో.. మొదట ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కి, లిఫ్ట్ తలుపును కొట్టాడు. ఆ తరువాత అసహనంతో గట్టిగా అరుస్తూ.. ఏడుపు అందుకున్నాడు.
ఈ ఘటన మొత్తం లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బిసార్ఖ్ ప్రాంతంలోని నిరాలా ఆస్పైర్ సొసైటీలో ఓ బాలుడు తన సైకిల్‌తో లిఫ్ట్‌లోకి ఎక్కాడు. తను వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి.. కాసేపు సైకిల్‌పై ఎక్కేందుకు ప్రయత్నించాడు. మళ్లీ కిందకు దిగి నిల్చున్నాడు. ఆ తరువాత లిఫ్ట్ ఆగిపోవడంతో ఏమైందోనని కంగారు పడిపోయాడు.
ఆ తరువాత లిఫ్ట్ డోర్ మొదటి డోర్ మెల్లిగా ఓపెన్ చేసుకోగా.. చేతులతో దూరంగా లాగాడు. రెండో డోర్ ఓపెన్ కాకడంతో చేతితో బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. రాకపోవడంతో వెంటనే ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేశాడు. అయినా డోర్ ఓపెన్ కాకపోవడంతో సైకిల్‌తో లిఫ్ట్‌కు ఢీకొట్టాడు. సాయం కోసం గట్టిగా అరుస్తూ.. ఒక్కసారిగా ఏడ్చాడు. బాలుడు అరుపులు విన్న ఓ వ్యక్తి వచ్చి.. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి రక్షించాడు. దాదాపు 10 నిమిషాల పాటు బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు.
यूपी के ग्रेटर #Noida स्थित निराला एस्पायर सोसायटी में एक 8 साल के मासूम बच्चे के #Lift में फंसने का वीडियो वायरल हो रहा है. मासूम ने मदद के लिए पहले अलार्म बटन दबाया, गेट पर हाथ मारे और खूब रोया-चिल्लाया, रोंगटे खड़े कर देगा #Video pic.twitter.com/gPr7vhpjz8
— Zee News (@ZeeNews) December 3, 2022
తమ కుమారుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినా గార్డు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో తాను వాష్‌రూమ్‌కు వెళ్లానని గార్డు చెబుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా కాసేపు భయాందోళనకు గురైంది. బాలుడు బయటకు రాగానే తన కుటుంబ సభ్యులకు జరిగిన బాధను వివరించాడు. కాగా.. ఇటీవలె ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు బాలికలు ఇలానే లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Hcu Thailand Student: హెచ్‌సీయూ అత్యాచారయత్న ఘటనలో ట్విస్ట్.. ఇంటికి తీసుకువెళ్లి మద్యం సేవించి..
Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయం.. బీజేపీ నుంచి సిగ్నల్స్.. జగ్గారెడ్డి జోస్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి