Biryani In Lord Ram Plates: భక్తి ఇప్పుడు వ్యాపారంగా మారింది. వ్యాపారాల్లో కూడా దేవుడిని వాడుకుని వ్యాపారం చేసేస్తూ భారీగా లాభపడుతున్నారు. దేవుడి పేరు చెప్పి దోచుకుంటున్న ఉదంతాలు చాలా చూస్తున్నాం. కానీ దేవుడి చిత్రపటంలో మాంసాహారం వడ్డిస్తూ ఓ వ్యాపారి చేస్తున్న బిజినెస్‌పై తీవ్ర వివాదం రేపింది. శ్రీరాముడి చిత్రపటం ఉన్న పేపర్ ప్లేట్‌లలో చికెన్ బిర్యానీ వడ్డించడం వివాదాస్పదమైంది. ఫలితంగా హిందూ సంఘాలు, హిందూవాదులు ఆ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో ఓ వ్యక్తి బిర్యానీ హోటల్ నడిపిస్తున్నాడు. చికెన్, మటన్ బిర్యానీ విక్రయిస్తున్నాడు. అంతటితో బాగానే ఉంది కానీ రాముడి చిత్రపటం ఉన్న పేపర్ ప్లేట్‌లలో మాంసాహారం వడ్డిస్తుండడం కలకలం రేపింది. కొందరు అది పట్టించుకోకుండా తినేయగా.. కొందరు హిందూవాదులు తప్పుబట్టారు. రాముడి ప్లేట్‌పై చికెన్ బిర్యానీ ఎలా విక్రయిస్తావని ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వెంటనే భజరంగ్‌దళ్ ప్రతినిధులు వచ్చి వ్యాపారితో గొడవపడ్డారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా అతడు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: BJP Candidate Viral Photo: ఎంపీ అభ్యర్థి అత్యుత్సాహం.. ప్రచారంలో యువతి బుగ్గపై ముద్దు
వెంటనే స్థానిక పోలీసులుక సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు హోటల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. పేపర్ ప్లేట్లు రాముడి చిత్రపటంతో వచ్చాయని దర్యాప్తులో తేలింది. రాముడి చిత్రపటం ఉందనే విషయాన్ని గమనించకుండా వడ్డించినట్లు హోటల్ యజమాని పోలీసులకు చెప్పాడు. ఇది దురుద్దేశంతో జరిగినదని కాదని యజమాని వివరణ ఇచ్చుకున్నాడు.
Jahangirpuri, Delhi: Biriyani was being served on paper plates with images of Lord Rama, locals and Bajrang dal object and complained to Police.
Investigation on.....https://t.co/gcojcxZYgU pic.twitter.com/HgxcgFEnke
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 23, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి