Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

Chennai Child Rescued:నాలుగవ అంతస్తు నుంచి బుడ్డోడు అనుకోకుండా తల్లి చేతుల్లో నుంచి జారిపోయి మరో అంతస్తుబిల్డింగ్ సందులో పడ్డాడు. దీంతో ఒక్కసారిగా తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అలర్ట్ అయ్యారు. చిన్నారి బిల్డింగ్ మధ్యలో ఆగి ఉన్నట్లు గమినించారు. ఈ క్రమంలో వారు చిన్నారిని కాపాడిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 29, 2024, 12:36 PM IST
  • చిన్నారి అన్నం తిన్పింస్తుండగా అనుకోని ఘటన..
  • కాపాడాలంటూ కేకలు వేసిన తల్లి..
Chennai Child Rescued: వావ్..  అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

Chennai 7 months old baby falls from 4 th floor rescued video goes viral: చిన్న పిల్లలను ఎంతో కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటు ఉండాలి. ఒక్క నిముషం కూడా వాళ్లను వదిలేసి, వేరేపనులవైపు కాన్సట్రెషన్ చేయకూడదు. కొన్నిసార్లు సెకన్ల వ్యవధిలోనే ఊహించని ఘటనలు జరిగిపోతుంటాయి. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారని వదిలేయకూడదు. ముఖ్యంగా నెలపై అంబాడుతున్న పిల్లలతో మరీ డెంటర్. అంతేకాకుండా.. పిల్లలను ఎప్పుడు కూడా ఒక కంట కడిపెడుతుండాలి. కొన్నిసార్లు తల్లిదండ్రలు తమ పిల్లలను వదిలేసి ఇతర పనుల్లో లీనమైపోతారు. కొందరు ఫోన్ లలో బిజీ అయిపోతుంటారు.దీంతో చిన్నారులు అంబాడుకుంటూ బైటకు వెళ్లిపోతుంటారు. అంతేకాకుండా.. చిన్నారులకు ఆటవస్తువులు ఇచ్చేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవే వారి ప్రాణాలకు ముప్పు తెవచ్చు. చాలా మంది పిల్లలు ఆడుకునేటప్పుడు ఆట వస్తువులు వారిగ గొంతులు ఇరుక్కున్నఘటనలు అనేకం ఉన్నాయి.

 

అంతేకాకుండా.. చిన్నారులు స్నానం చేస్తున్నారని, నీళ్లతో ఆడుకుంటున్నారని వదిలేసి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో చిన్నారులు నీటి బకెట్ లోపడిపోవడం, గొంతులో చిన్నవస్తువులు ఇరుక్కుని ఊపిరాడకుండా అయిపోయి చనిపోయిన ఘటనలు కొకొల్లలు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి క్రమంలో అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కానీ కొన్నిసార్లు టైమ్ బాగుంటే చిన్నారులు పెద్ద ప్రమాదం నుంచి ఇట్టే బైటపడుతుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. 

తమిళనాడులోని చెన్నైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరుముల్లైవాయల్‌లోని హై-రైజ్‌ అపార్ట్‌మెంట్ సొసైటీలో ఈఘటన జరిగింది. ఒక తల్లి తన నాలుగో ఫ్లోర్ లో తన ఏడునెలల చిన్నారికి బాల్కనీలో నిలబడి అన్నం తిన్పిస్తుంది. ఇంతలో ఏమైందో ఏమో కానీ చిన్నారి ఒక్కసారిగా అపార్టమెంట్ నాలుగో ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ సందులో పడిపోయాడు. దీంతో ఆ తల్లి షాకింగ్ గు గురయ్యింది. వెంటన తన బిడ్డను కాపాడాలంటూ గట్టిగా కేకలు వేసింది. అపార్ట్ మెంట్ వాసులంతా అలర్ట్ అయిపోయారు. కొందరు గ్రౌండ్ ఫ్లోర్ మీదకు పరిగెత్తుకుని వెళ్లారు. చిన్నారి మాత్రం మూడో ఫ్లోర్ మీద పడి ఆగిపోయాడు. ఎటుకదలకుండా అలానే ఉండిపోయాడు.

కొందరు సెకండల్ ఫ్లోర్ నుంచి చిన్నారిపడిపోయిన ఫ్లోర్ పైకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఏమో.. పిల్లాడు కిందపడిపోతే.. దెబ్బలు తగలకుండా బెడ్ షిట్లు, పరుపులతో నెట్ మాదిరిగా ఏర్పాట్లు చేశారు. కానీ ఇద్దరు వ్యక్తులు చాకచాక్యంగా పైకి వెళ్లి.. చిన్నారిని మెల్లగా కాలుపట్టుకుని కిందకు దించుకున్నారు. దీంతో తల్లిదండ్రులు, అపార్ట్ మెంట్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారికి అస్సలు గాయాలు కూడా ఏమి కాలేదని తెలుస్తోంది.

Read More: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..

పిల్లాడిని కాపాడిన వ్యక్తులకు తల్లిదండ్రులు కన్నీళ్లుపెట్టుకుంటూ ధన్యవాదాలు తెలిపారు. అక్కడున్న అపార్ట్ మెంట్ వాసులు కూడా శభాష్.. అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. బుడ్డోడీని భలే సెఫ్ చేశారని, పిల్లాడికి ఏంకాలేదు.. అది చాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం..  ఇంత నెగ్లిజెన్సీగా ఎలా ఉంటారని ఆతల్లిపై మండిపడుతున్నారు. పిల్లల కోసం కొందరు తల్లులు ఎంతగా పరితపిస్తారో తెలీదా.. అలాంటి పిల్లలు పుట్టాక ఇలానా ఉండేదంటూ ఫైర్ అవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News