స్మార్ట్ ఫోన్ రంగంలో దిగ్గజమైన శాంసంగ్ (Samsung ) అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం1 కోర్ ( Galaxy M1 Core ) గా రేపట్నించి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే.
శాంసంగ్ దేశంలో తొలి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గా గెలాక్సీ ఎం1 కోర్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్ ఫోన్లలో ఇదే అత్యంత చవకైనది. ఇప్పటికే అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్టీ ఎం1 సిరీస్ లో...కొత్తగా ప్రవేశపెట్టిన శాంసంగ్ గెలాక్టీ ఎం1కోర్ ( Galaxy M1 core ), గెలాక్టీ ఎం1 ఎస్ ( Galaxy M1 S ) లు చేరాయి. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఈ ఫోన్ కు వెనుకవైపు ఒకే కెమేరా ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్లున్నాయి. Also read: Before Coronavirus: ట్రైన్ జర్నీ మిస్ అవుతున్నారా ? ఈ వీడియో మీకోసమే!
గెలాక్సీ ఎం1 కోర్ ...1 జీబీ ర్యామ్, 16 జిబి స్టోరేజ్ తో కేవలం 5 వేల 499 రూపాయలకు లభించనుంది. ఇక 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో అయితే 6 వేల 499 గా ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. 5.3 అంగుళాల హెచ్ డి టీఎఫ్టీ డిస్ ప్లే ( HD TFT Display ) తో క్వాడ్ కోర్ మీడియాటెక్ 6739 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. బ్యాక్ కెమేరా 8 మెగాపిక్సెల్ తో , ఫ్రంట్ కెమేరా 5 మెగాపిక్సెల్ తో ఉంటుంది.3 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉన్న ఈ చవకైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జూలై 29 నుంచి ప్రారంభం కానున్నాయి. Also read: Viral Video: భూమి ఊపిరి పీల్చుకోవడం ఎప్పుడైనా చూశారా ?