Truck Falling Down: ట్రక్కును ఓవర్ టేక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త

Truck Falling Down: రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎల్లవేళలా జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. అన్నింటికి మించి అతివేగం అసలే పనికిరాదు." స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్  " అంటే ఏంటో తెలిసిందే కదా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పే క్రమంలో ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 09:16 PM IST
Truck Falling Down: ట్రక్కును ఓవర్ టేక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త

Truck Falling Down: భూమ్మీద నూకలు బాకీ ఉండాలే కానీ ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా బతికి బట్ట కట్టొచ్చు అని నిరూపించిన ఘటన ఇది. యముడికి వెల్‌కమ్ చెబుతున్నట్టుగా ఓవర్ టేక్ చేసుకుని వెళ్లి మరి ట్రక్కు కిందపడబోయారు. కానీ అదృష్టం బాగుంది కాబట్టి ప్రమాదం వారిని ముందే హెచ్చరించింది. ఫలితంగా ఒక స్కూటీ రైడర్, మరో కారులో వెళ్తున్న జనం ఆ ట్రక్కు కింద క్రష్ అయిపోయే వాళ్లే. 

రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎల్లవేళలా జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. అన్నింటికి మించి అతివేగం అసలే పనికిరాదు." స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్  " అంటే ఏంటో తెలిసిందే కదా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పే క్రమంలో ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారు. హెచ్చరికల కోసం చెప్పే ఇలాంటి మాటల్లో అక్షరసత్యం ఉంటుంది.

Trending News