ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇండియన్ బిజినెస్ టైకూన్ ఎవరో గుర్తుపట్టగలరా...

Who is this indian business tycoon : ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కనిపిస్తున్న దిగ్గజ వ్యాపారవేత్త ఎవరో గుర్తుపట్టగలరా.. మీకోసం ఇక్కడ క్లూస్ కూడా ఇచ్చాం.. ప్రయత్నించండి... 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 10:48 AM IST
  • ఈ ఫోటోల కనిపిస్తున్నదెవరో గుర్తుపట్టండి
  • ఆయనో ఇండియన్ బిజినెస్ టైకూన్
  • ఆటో మొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీకి ఛైర్మన్
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇండియన్ బిజినెస్ టైకూన్ ఎవరో గుర్తుపట్టగలరా...

Who is this indian business tycoon : ఆయనో బిజినెస్ టైకూన్... ఆటో మొబైల్ రంగంలో ఓ దిగ్గజ కంపెనీకి ఛైర్మన్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు... ముఖ్యంగా టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు... ఈమాత్రం క్లూ చాలు ఆయనెవరో ఈపాటికే గుర్తు పట్టడానికి. ఆయనే.. ఆనంద్ మహీంద్రా. తాను యువకుడిగా ఉన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను తాజాగా ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

నిజానికి తాను ఫిలిం మేకర్ కావాలనుకున్నానని... ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశానని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ట్వీట్‌లో వెల్లడించారు. 'ఇక్కడ కనిపిస్తున్న ఫోటోకి సమాధానం చెప్పడం చాలా సులువు. నాకు ఫిలిం మేకర్ కావాలని ఉండేది. దానికి సంబంధించిన కోర్సు కూడా చేశాను. 77 కుంభమేళాలో నేను చేసిన ఫిలిం అప్పట్లో నా థీసిస్. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఇండోర్‌ సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తుండగా తీసినది. ఆ ఫోటోలో నా చేతిలో ఉన్న 16mm కెమెరా ఏంటో ఎవరైనా గుర్తించలగలరా..?' అంటూ ఆ ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా అడిగిన ప్రశ్నకు పలువురు నెటిజన్లు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) చేతిలో ఉన్నా బొలెక్స్ వుండ్ కెమెరా అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ARRIFLEX 16SR అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినట్లు... మీరు ఫిలిం మేకర్ కావాలనుకుని వ్యాపారవేత్త అయ్యారన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు ఇప్పటివరకూ 2519 లైక్స్ వచ్చాయి.

Also Read: Sushath Singh: ఇవాళ సుశాంత్ 36వ జయంతి.. మిస్ యూ అంటూ ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్

Also Read: Suicide: ప్రముఖ దర్శకుడి బావ ఆత్మహత్య... ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News