Viral Video: బిపర్‌జోయ్ తుపాను, సముద్రంలో దూకి రిపోర్టింగ్, వైరల్ అవుతున్న వీడియో

Viral Video: మనం నిత్యం వివిధ రకాల వైరల్ వీడియోలు చూస్తుంటాం. అదే సమయంలో వివిధ రకాల వార్తలు వింటుంటాం. వార్తే వైరల్ వీడియోగా మారితే పరిస్థితి ఏంటి. అదే జరిగింది పాకిస్తాన్‌లో. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

Last Updated : Jun 15, 2023, 01:35 AM IST
Viral Video: బిపర్‌జోయ్ తుపాను, సముద్రంలో దూకి రిపోర్టింగ్, వైరల్ అవుతున్న వీడియో

Viral Video: అతి తీవ్ర తుపానుగా మారిన బిపర్‌జోయ్ ఇండియాలో గుజరాత్ తీరాన్ని, పాకిస్తాన్‌లో సింధ్ ప్రాంతాన్ని వణికిస్తోంది. తుపాను బీభత్సం ఎలా ఉందో చెప్పేందుకు ఓ రిపోర్టర్ చేసిన సాహసమా లేక అత్యుత్సాహమో తెలియదు గానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారింది. తొలుత పాకిస్తాన్‌లో తీరం దాటుతుందని అంచనా వేసినా ఆ తరువాత  దిశ మార్చుకోవడంతో గుజరాత్ కచ్ వద్ద తీరం దాటుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ తుపాను ప్రభావంతో ఇండియాతో పాటు పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు కూడా అంతే నష్టం వాటిల్లనుంది. అందుకే సింధ్ ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలోనే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ రిపోర్టర్ రిపోర్టింగ్‌కు సంబంధించింది. బిపర్‌జోయ్ తుపాను ప్రభావం ఎలా ఉందో వివరించే క్రమంలో అతడు చేసిన సాహసం అందర్నీ ఆశ్చర్చపర్చింది. అందుకే ఈ వీడియో అంతగా వైరల్ అవుతోంది.

పాకిస్తాన్‌లోని ఓ స్థానిక ఛానెల్ రిపోర్టర్ బిపర్‌జోయ్ తుపాను గురించి కరాచీ వద్ద సముద్రతీరంలో అక్కడి పరిస్థితిని వివరిస్తూ రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు ఎలా చేరుకుంటున్నాయి, ఎంత లోతులో నీళ్లున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నీళ్లు ఎంత లోతున్నాయో స్వయంగా దిగి చూపిస్తే గానీ ప్రేక్షకులకు అర్ధం కాదనుకున్నాడో ఏమో...ఈ నీళ్లలో జంప్ చేసి చూపిస్తాను ఎంత లోతున్నాయో అని చెబుతూ ఒక్కసారిగా సముద్రం నీళ్లలో దూకేశాడు. నీళ్లలో దూకి తిరిగి రిపోర్టింగ్ కొనసాగించాడు. తుపాను కారణంగా పడవలు ఒడ్డుకు చేరిన వైనాన్ని ఈదుతూ వర్ణించాడు.

ఇది చూసిన వారు కొంతమంది సాహసమని అభివర్ణిస్తుంటే మరికొందరు అత్యుత్సాహమని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే ఇలాంటి రిపోర్టర్ అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఫన్నీ రిపోర్టింగ్ అంటూ ఆటపట్టిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది.

Also read: Youtube New Rules: యూట్యూబర్లకు గుడ్‌న్యూస్, మానిటైజేషన్ నిబంధనల్లో భారీగా సడలింపులు, కొత్త నిబంధనలివే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News