Bengaluru ola auto driver attack on passenger: సాధారణంగా ఇటీవల కాలంలో చాలా మంది క్యాబ్ సర్వీసులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓలా, ఉబర్, ర్యాపీడో వంటి సర్వీసులను జర్నీల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇదిలా ఉండగా.. కొన్నిసార్లు.. క్యాబ్ లు బుక్ చేసుకున్నప్పుడు.. కొన్నిసార్లు క్యాబ్ లు ఆలస్యంగా వస్తాయి. మరికొన్నిసార్లు క్యాబ్ వాళ్లు మన రైడ్ ను క్యాన్షిల్ చేస్తుంటారు. మరికొన్నిసార్లు, బుక్ చేసిన వాళ్లు సైతం.. క్యాబ్ రైడ్ ను క్యాన్షిల్ చేసుకుంటు ఉంటారు.
#WATCH - Bengaluru Auto Driver Allegedly Slaps Woman After She Cancels Auto Ride.#Viral #ViralVideo #Bengaluru #AutoDriver pic.twitter.com/pNyhpiBd3i
— TIMES NOW (@TimesNow) September 5, 2024
కొంత మంది ఇలాంటి విషయాలను లైట్ గా తీసుకుంటు ఉంటారు. మనం రైడ్ ను క్యాన్షిల్ చేస్తే.. కొన్నిసార్లు మనకు ఫైన్ కూడా పడుతుంది. ఆ చార్జీలు కూడా కంపెనీలు సైతం మన దగ్గరే క్యాబ్ సర్వీసులు వసూల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ఒక క్యాబ్ డ్రైవర్ యువతి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పూర్తి వివరాలు..
బెంగళూరులో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతి ఓలా యాప్ లో క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో కానీ.. ఆమె రైడ్ ను క్యాన్షిల్ చేసుకుని మరో ఆటోలో ఎక్కింది. అప్పటి వరకు ఆ ఓలా ఆటో డ్రైవర్ లోకేషన్ కువచ్చేశాడు. కానీ ఆమె మాత్రం.. మరో ఆటోలో ఎక్కి కూర్చుంది. నా రైడ్ ను ఎందుకు క్యాన్షిల్ చేశావని ఆమెతో గొడవకు దిగాడు. ఆమె నా ఇష్టం.. నేను రైడ్ క్యాన్షిల్ చేసుకుంటా.. నీకేందుకు అని అదే రేంజ్ లో ఆన్సర్ కౌంటర్ ఇస్తుంది.
కొన్నిసార్లు క్యాబ్ డ్రైవర్లు కూడా.. క్యాన్షిల్ చేస్తుంటారు కదా.. అని ఆమె చెప్పింది. కానీ అతను మాత్రం.. కోపంతో రెచ్చిపోయాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్దామని కూడా మాట్లాడింది. దీంతో ఓలా క్యాబ్ డ్రైవర్ కోపంతో యువతిని చెంపదెబ్బకొట్టాడు. దీంతో సదరు యువతి.. ఎందుకు నన్ను కొట్టావ్.. మీరు అని నేను.. రెస్పెక్ట్ ఇచ్చిమాట్లాడుతున్నాను.. నన్నేందుకు కొట్టారంటూ కూడా వాపోయింది.
Read more: GYM Workouts in Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..
ఓలా డ్రైవర్ మాత్రం.. ఏమాత్రం.. వెనక్కు తగ్గకుండా దేనీకైన రెడీ అన్నట్లు రెచ్చిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు. ఓలా ఆటో డ్రైవర్ పైన చర్యలు తీసుకొవాలని కూడా నెటిజన్ లు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.