Viral Videos: అడవి జంతవులు అప్పుడబ్బుడు దారి తప్పి జనావాసాల్లోకి రావడమే చాలా సార్లు చూస్తుంటాం. ముఖ్యంగా పులులు, చిరుతలు, ఎగులు బంట్లు, ఏనుగుల వంటి వన్య ప్రాణులు ఊర్లల్లోకి వచ్చి జనాన్ని హడలెత్తిస్తుంటాయి.
అలాంటి ఓ ఘటనే ఓ పెళ్లి రిసెప్పషన్లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే..
పెళ్లీ రిసెప్షన్ వేడుకకు ఏర్పాటు చేసిన స్టేజ్‌పైకి అనుకోను అతిథులు ఎంటర్ అయ్యారు. మూడు ఎలుగు బంట్లు స్టేజ్‌పైకి వచ్చాయి. అందులో ఒకటి తల్లి ఎలుగుబటి కాగా రెండు దాని పిల్లలు.
రిసెప్షన్ వేడుక అయిపోయి.. కొత్త జంట సహా.. పార్టీకి హాజరైన వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎలుగుబంటి పిల్లలతో రావడం గమనార్హం. దీనితో అక్కడకు వచ్చిన గెస్ట్‌లకు గానీ, మనుషుల వల్ల ఎలుగు బంటికి, దాని పిల్లలకు గానీ ఎలాంటి హానీ జరగలేదు.
ఎలుగు బంటి స్టేజ్‌పైకి రావడం అటు ఇటు తిరగటాన్ని.. ఈవేంట్ నిర్వహించిన సంస్థ స్టాఫ్ ఒకరు వీడియో తీశారు. వీడియోలో ఉన్న వాయిస్ వింటే.. అది మనపై దాడి చేయదు కదా? అని ఓ వ్యక్తి మాట్లాడినట్లు ఉంది. నిజంగానే ఆ వ్యక్తి అనుకున్నట్లు ఆ ఎలుగుబంటి ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయిది.
ఇక ఈ వీడియోను.. రీ ట్వీట్ చేస్తూ చాలా మంది తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తూ.. 'బహుశా పార్టీ ఏర్పాట్లతో అవి సంతోషంగా లేవనుకుంటా' అనీ ఫన్నీగా స్పందించారు.
They are not happy with the arrangement. It seems. https://t.co/9Af4fErhdb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 16, 2022
మరో ట్విట్టర్ యూజర్ కూడా.. డెకరేషన్ నచ్చలేదనుకుంటా.. అని రాసుకొచ్చాడు.
మరో ట్విట్టర్ యూజర్.. ఎలుగు బంటి కుటుంబ సమేతంగా పెళ్లికి వచ్చిన వేళ అని రాసుకొచ్చారు.
Also read: Viral Video: పెళ్లి కూతురు ముస్తాబు చూసి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు!
Also read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook