Maharashtra: ఆ కుర్రాడు చదివింది ఎనిమిదో తరగతే. కానీ తెలివితేటల మాత్రం అమోఘం. సొంతంగా హెలికాప్టర్ తయారు చేయాలని కలలు కన్నాడు. అనుకున్న విధంగానే హెలికాప్టర్(helicopter) తయారు చేసి...అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
దానికి 'మున్నా హెలికాప్టర్' అని పేరు పెట్టి..స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రజల ముందు ప్రదర్శించాలనుకున్నాడు. కానీ అదే హెలికాప్టర్ రెక్క...తన గొంతుకు తగిలి మరణించాడు. ఈ విషాద సంఘటన మహరాష్ట్ర(Maharashtra)లోని యావత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా ఫుల్సవంగి గ్రామంలో చోటుచేసుకుంది.
మహాగావ్ తాలూకా ఫుల్సవంగికి చెందిన షేక్ ఇస్మాయిల్(24) తన సోదరుడి గ్యాస్ వెల్డింగ్ వర్క్‌షాప్‌లో పనిచేస్తూ, అందులో ప్రావీణ్యం సాధించాడు. ఇస్మాయిల్‌కు విమానాల్లో ప్రయాణించడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. త్రీ ఇడియట్స్ సినిమా చూసి ఇస్మాయిల్ తానే సొంతంగా ఒక హెలికాప్టర్ (helicopter)తయారు చేయాలని భావించాడు. ఆ దిశగా నిత్యం ప్రయత్నాలు చేస్తుండేవాడు.
Also Read: రష్యా సరస్సులో కూలిన పర్యాటక హెలీకాప్టర్, 7 మంది గల్లంతు
గత రెండేళ్లుగా యూట్యూబ్ (Youtube)చూస్తూ, కావాల్సిన పరికరాలు సమకూర్చుకుంటూ ఓ హెలికాప్టర్(helicaptor)ను తయారుచేశాడు. బుధవారం వేకువజామున దాని ట్రయల్ రన్ ప్రారంభించాడు. సాంకేతిక లోపం తలెత్తడంతో...రోటర్ బ్లేడ్ విరిగి రెక్క ఊడిపోయింది. అది క్యాబిన్ లోపల ఉన్న ఇస్మాయిల్‌కు తగలడంతో గొంతు తెగి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఇస్మాయిల్ ప్రయోగాన్ని కొంతమంది స్నేహితులు సెల్‌ఫోన్లల్లో కూడా చిత్రీకరించారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. .‘‘ ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని కలలు కన్న ఇస్మాయిల్ అది నెరవేరకుండానే మరణించాడు’’ అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook