Xiaomi 15 Pro Price In India: పాపులర్ మొబైల్ తయారీ కంపెనీ Xiaomi త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. త్వరలోనే తమ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ Xiaomi 15 Proను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం కెమెరా సెటప్‌తో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌కు సంబంధించిన ఫీచర్స్‌ను ఇంకా కంపెనీ అధికారిక వెళ్లడించలేదు. త్వరలోనే వీటి వివరాలను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది.
ఈ Xiaomi 15 Pro స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా కెమెరాలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ 6100 mAh బ్యాటరీతో పాటు 90 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ధర చూస్తే.. ఇది రూ.40 వేల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే Xiaomi 15 ప్రో స్మార్ట్‌ఫోన్ కొన్ని ప్రత్యేకమైన స్పెషిఫికేషన్స్ కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక Xiaomi 15 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు ఓరియన్ కోర్లతో రన్ కాబోతున్నట్లు లీక్ అయిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇందులో Adreno 830 GPU ఉండడం వల్ల కొన్ని గంటల పాటు బ్యాక్ టు బ్యాక్ గేమింగ్ చేయవచ్చు. ఇది 12 GB LPDDR5X ర్యామ్‌ని కలిగి ఉంటుంది.
ఈ Xiaomi 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. బ్యాక్ సెటప్‌లో 50 MP ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ కెమెరాల్లో ప్రత్యేకమైన f/1.4 ఎపర్చరుతో వైడ్-యాంగిల్ ప్రైమరీ లెన్స్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే దీనికి ప్రత్యేకమైన అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా ఉండబోతోంది.
ఈ మొబైల్ ఫ్రంట్ భాగంలో 32 MP కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన ఫుటేజీ కోసం OIS, EIS వంటి ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు 8K నుంచి 4K వరకు అధునాతన వీడియో రికార్డింగ్ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్ 6100 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
Xiaomi 15 ప్రో స్మార్ట్‌ఫోన్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. అలాగే దీని డిస్ల్పే ప్రత్యేకమైన 1440 x 3200-పిక్సెల్ రిజల్యూషన్‌తో రాబోతోంది. అంతేకాకుండా 6.73-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో విడుదల కాబోతోంది. ఇది విభిన్న కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతున్నట్లు లీక్ వివరాల్లో పేర్కొన్నారు.