Indian Railways: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వేస్ భారీ శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అనేక ప్లాన్ లు వేసుకుంటున్నారు.
తిరుమలను కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. శ్రీవారి దర్శనానికి వేల కిలో మీటర్ల దూరంనుంచి వస్తుంటారు. స్వామి వారి దర్శనం కోసం ఎన్ని గంటలైన వేచీ ఉంటారు.
ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముక్కొటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
అందుకే తిరుమలలో వైకుంఠ ఏకాదశికి వెళ్లేందుకు చాలా మంది భక్తులు ముందుగానే ప్లాన్ లు చేసుకుంటారు. కొందరు బస్సులు, రైల్వేలు, విమానాలు, సొంత వాహనాలలో వెళ్తుంటారు. అయితే.. రైళ్లలో ప్రస్తుతం ఎక్కడ చూసికూడా బుక్కింగ్ లు ఫుల్ గా ఉన్నట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది. ఇప్పటికే పలు రైళ్లకు అధికారులు జనరల్ భోగీల సంఖ్యను పెంచారు. అదే విధంగా రైళ్ల టైమింగ్స్ లో కూడా మార్పులు చేశారు.
ఇప్పటి వరకు.. 31 రైళ్ల బోగీలను పెంచిన అదికారులు.. మరో 9 రైళ్లకు అదనంగా భోగీలను పెంచుతు ఉత్తర్వులు ఆదేశాలిచ్చిట్లు తెలుస్తొంది. తిరుపతి హజ్రత్ నిజాముద్దీన్, హైదరబాద్ జైపూర్ హైదరాబాద్, నాందేడ్ అమృత్‌సర్ హైదరాబాద్.. ఇలా మొత్తంగా తొమ్మిది రైళ్లకు అదనంగా భోగీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తొంది.
విజయవాడ నుంచి విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718) ఉదయం 6.15కి బదులు 6 గంటలకు స్టార్ట్ అవుతుందని తెలుస్తొంది. దీనితో పాటు అనేక రైల్వేల సమయంలో కూడా మార్పులు చేపట్టినట్లు తెలుస్తొంది. పూర్తి సమాచారం కోసం ఇండియన్ రైల్వేస్ అఫిషీయర్ వెబ్ సైట్ ను సందర్శించాలని కూడా ఇండియన్ రైల్వేస్, ఐఆర్సీటీసీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.