Singapore Freedom Story: స్వాతంత్ర్యం వద్దనుకున్న ఏకైక దేశం, కారణాలేంటి

ఇండిపెండెన్స్ డే అంటే ఇంచుమించు ప్రతి దేశానికి ఓ వేడుక. గర్వ కారణం. ప్రపంచంలో చాలా దేశాలు ఇతర దేశాల్నించి స్వాతంత్ర్యం పొందినవే. ప్రజలు ప్రాణత్యాగం, పోరాటాల ఫలితంగా వివిధ దేశాలకు వేర్వేరు సందర్భాల్లో స్వేచ్ఛ లభించింది. అంటే దాదాపు అన్ని దేశాలు స్వాతంత్ర్యం కోసం పోరాడుకున్నవే. కానీ ఓ దేశం మాత్రం స్వాతంత్ర్యం వద్దనుకుంది. బలవంతంగా ఇండిపెండెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ దేశమే ఇప్పుడు అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న సింగపూర్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

Singapore Freedom Story: ఇండిపెండెన్స్ డే అంటే ఇంచుమించు ప్రతి దేశానికి ఓ వేడుక. గర్వ కారణం. ప్రపంచంలో చాలా దేశాలు ఇతర దేశాల్నించి స్వాతంత్ర్యం పొందినవే. ప్రజలు ప్రాణత్యాగం, పోరాటాల ఫలితంగా వివిధ దేశాలకు వేర్వేరు సందర్భాల్లో స్వేచ్ఛ లభించింది. అంటే దాదాపు అన్ని దేశాలు స్వాతంత్ర్యం కోసం పోరాడుకున్నవే. కానీ ఓ దేశం మాత్రం స్వాతంత్ర్యం వద్దనుకుంది. బలవంతంగా ఇండిపెండెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ దేశమే ఇప్పుడు అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న సింగపూర్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
 

1 /7

విడిపోయిన పార్టీలు మలేషియా ఏర్పాటు తరువాత ఎన్నికలు జరిగాయి. సింగపూర్ రాజకీయం సమస్యగా మారింది. ఎందుకంటే మలేషియా ప్రధాన పార్టీ యునైటెడ్ మలేజ్ నేషనల్ ఆర్గనైజేషన్ అనేది మలేయ్ మల్టీ నేషనల్ ఏర్పాటు చేయాలనుకునేది. సింగపూర్ నేతలు మాత్ర దీనికి వ్యతిరేకమయ్యారు. మలేషియా పాలనకు వ్యతిరేకంగా పీపుల్స్ యాక్షన్ పార్టీ పుంజుకుంది. ఇక్కడున్న లక్షలాదిమంది ప్రజలు వాస్తవానికి మలయ్ వాసీయులు కాదు. ఇండియా లేదా ఇతర దేశాలకు చెందినవాళ్లు.

2 /7

బ్రిటీషు పాలన ముగింపు బ్రిటీషు పాలన ముగిసిన తరువాత నైరుతి ఆసియా దేశాలు కలిసి  1963లో మలేషియా పేరుతో ఓ సంఘం ఏర్పర్చేందుకు నిర్ణయించాయి. ఆర్ధి పరిస్థితులు మెరుగుపర్చుకోవడం, కలసికట్టుగా రక్షణ వ్యవస్థ ఏర్పర్చుకోవడం దీని ఉద్దేశ్యం. ఆ సమయంలో ప్రపంచంలో సోషలిస్ట్ పాలన వ్యాపిస్తోంది. అందుకే మలేషియా వ్యవస్థ ఏర్పడింది

3 /7

బ్రిటీషు ఆక్రమణలో సింగపూర్ దేశం స్వాతంత్ర్యం వద్దనుకుంది. బలలవంతంగా తీసుకోవల్సి వచ్చింది. ఈ దేశం స్వాతంత్ర్య కధ చాలా విచిత్రంగా ఉంటుంది. సింగపూర్ చరిత్ర మధ్యయుగం నుంచి ఉంది. మలేషియాకు దక్షిణాన ఉన్న ఓ ద్వీపంలో ప్రజల నివాసం ప్రారంభమైంది. 19వ శతాబ్దం వరకూ ఈ ద్వీపంపై బ్రిటీషు దృష్టి పడలేదు. వ్యాపార మార్గాల్ని నియంత్రించేందుకు బ్రిటీషు సింగపూర్‌ను ఆక్రమించింది. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్‌కు వశమైంది. కానీ ఆ తరువాత తిరిగి బ్రిటీష్ ఆధీనంలో వచ్చేసింది

4 /7

1965 ఆగస్టులో రహస్య ఒడంబడిక ద్వారా సింగపూర్‌ను మలేషియాను వేరు చేశారు. ఆగస్టు 9వ తేదీ 1965న కువాన్ యూ స్వయంగా సింగపూర్ స్వతంత్ర్య దేశమని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేస్తూ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. 

5 /7

ఆ తరువాత జరిగిన వివిధ పరిణామాలతో సింగపూర్‌ను మలేషియా నుంచి ప్రత్యేకం చేయాలనే ప్రతిపాదన వచ్చింది.  ప్రజల ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. 

6 /7

1965 మే వరకూ ఈ రెండు రాజకీయ పార్టీలు ఘర్షణ కొనసాగించాయి. ఈ క్రమంలో మలేషియా ప్రధాని తుంకూ అబ్దుల్ రెహమాన్ చేసిన ప్రకటన మరోసారి ఇరువురి మధ్య ఆజ్యం పోసింది. అంతే ఒకరిపై మరొకరు తీవ్రమైన చర్యలకు దిగారు

7 /7

పార్టీల మధ్య సంఘర్షణ ఈ క్రమంలో రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణను ఆపేందుకు ప్రయత్నం జరిగింది. పీపీపీ సింగపూర్‌లో పనిచేస్తే యూఎమ్ఎన్ఓ మిగిలిన ప్రాంతాల్లో పనిచేస్తుంది. ఇదొక నెల సాగింది. ఆ తరువాత నిబంధనలు ఉల్లంఘించడంతో రెండు పార్టీల మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగింది