10 Cities: ప్రపంచపటం నుంచి మాయం కానున్న 10 నగరాలు, జాబితాలో ఈ నగరం కూడా

భూమ్మీద ఉష్ణోగ్రత అంతకంతకూ పెరుగుతోంది. నాసా శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఇది చాలా ప్రమాదకరంగా మారనుంది. ఎంతలా ఉంటే రానున్న భవిష్యత్తులో ప్రపంచంలోని పది నగరాలు సముద్రంలో సమాధి అయిపోతాయి. ఆ 10 నగరాలేవో చూద్దాం.

10 Cities: భూమ్మీద ఉష్ణోగ్రత అంతకంతకూ పెరుగుతోంది. నాసా శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఇది చాలా ప్రమాదకరంగా మారనుంది. ఎంతలా ఉంటే రానున్న భవిష్యత్తులో ప్రపంచంలోని పది నగరాలు సముద్రంలో సమాధి అయిపోతాయి. ఆ 10 నగరాలేవో చూద్దాం.
 

1 /10

30 ఏళ్లలో 9 సెంటీమీటర్ల పెరిగిన సముద్ర మట్టం సముద్రంలో నీటి మట్టం పెరగడం కేవలం ద్వీప దేశాలకే కాకుండా ఇతర దేశాలకు సైతం ముప్పు కానుంది. నాసా ప్రకారం గత 30 ఏళ్లలో సముద్రమట్టం 9 సెంటీమీటర్లు పెరిగింది. దీన్నొక ప్రమాద ఘంటికగా అర్ధం చేసుకుని రానున్న 50 ఏళ్లలో పది నగరాలు సముద్రంలో సమాధి కాగలవంటున్నారు

2 /10

ఎప్పటికప్పుడు పెరుగుుతన్న భూమి ఉష్ణోగ్రత నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా చెప్పిందాని ప్రకారం భూమి ఉష్ణోగ్రత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం పెరుగుతోంది.

3 /10

ఈ శతాబ్దంలో సమాధి కానున్న నగరాలు శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలోని ఈ 10 నగరాలు 2100 వరకూ సముద్రంలో సమాధి అయిపోతాయి.

4 /10

ప్రతి ఏటా 7 అంగుళాలు మునుగుతున్న జకార్తా ఇండోనేషియా రాజధాని జకార్తాకు అన్నింటికంటే పెద్ద ముప్పు పొంచి ఉంది. అత్యధికంగా భూగర్భ జలం సరఫరా కారణంగా ఈ నగరం ప్రతి ఏటా 6.7 అంగుళాలు మునుగుతోంది. అందుకే ప్రభుత్వం రాజధానిని 100 మైళ్లు దూరం మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికోసం 33 బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది

5 /10

ప్రతి ఏటా 2 అంగుళాలు మునుగుతున్న హ్యూస్టన్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో కూడా అత్యధికంగా భూగర్భజలం వినియోగించడం వల్ల ప్రతి ఏటా 2 అంగుళాలు మునుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని దశాబ్దాల్లో ఈ నగరం పూర్తిగా సమాధి కాగలదు

6 /10

సముద్రంలో మునుగుతున్న నైజీరియాలోని ఈ నగరం గ్లోబల్ వార్మింగ్ కారణంగా నైజీరియాకు చెందిన లాగోస్ నగరం సముద్రంలో మునగబోతోంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ శతాబ్దం చివరికి  ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం 6.6 అడుగులు పెరగనుంది. ఫలితంగా లాగోస్ ఉనికి కోల్పోవచ్చు

7 /10

బంగ్లాదేశ్‌కు పొంచి ఉన్న ముప్పు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాపై జలవాయు పరివర్తనం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. నివేదికల ప్రకారం 2050 వరకూ దేశంలోని 17 శాతం భూమి సముద్రంలో సమాధి అవుతుంది. దాంతో 1.8 కోట్లమంది స్థానభ్రంశం కాగలరు

8 /10

నెమ్మదిగా మునుగుతున్న వెనిస్ నగరం ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటి వెనిస్. ఇటలీలోని వెనిస్ నగరం ప్రతి ఏటా 0.08 అంగుళాల చొప్పున సముద్రంలో మునుగుతోంది. ఇటీవలి కాలంలో ఈ నగరం చాలా సార్లు వరదల్లో చిక్కుకుంది

9 /10

వర్జీనియా వైపు దూసుకెళ్తున్న సముద్ర నీరు అమెరికాకు చెందిన వర్జీనియాలో సముద్రమట్టం 2010 వరకూ 12 అడుగులు మునగవచ్చు. 

10 /10

ధ్వంసం కానున్న నగరాలు ఇవే కాకుండా ధాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్, అమెరికా రాష్ట్రం లూసియానాలోని న్యూ అరాలియన్స్ నగరం, నెదర్లాండ్స్ కు చెందిన రాట్‌డ్యామ్ నగరం, ఈజిప్పులోని అలెగ్జాండ్రియా, ఫ్లోరిడాలోని మియామీ ప్రాంతం సముద్రంలో మనగవచ్చు.