Most Expensive & Worst Coffee Recipe: కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రపంచంలో చాలా రకాల కాఫీలు అందుబాటులో ఉన్నాయి. కాఫీ ప్రేమికులు కూడా ఎక్కువే. విదేశాల్లో అయితే కొత్త కొత్త రకం కాఫీలు ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ అంటే కోపీ లువాక్ కాఫీ. బిలియనీర్లు తాగుతుంటారు. అయితే ఇది ఎలా తయారు చేస్తారో వింటే వాంతులు చేసుకోవడం ఖాయం..ఎంత ఖరీదైందో అంత దరిద్రంగా తయారీ ఉంటుంది
ఈ కాఫీ వెనుక రహస్యం కోపీ లువాక్ అనేది లువాక్ ఆధారంగా వచ్చిన పేరు. లువాక్ అనేది ఓ రకమైన పిల్లి. ఇండోనేషియాలో ఉంటుంది. ఈ పిల్లి తోక కోతి తోకలా పొడుగ్గా ఉంటుంది.
కాఫీ తయారీలో లువాక్ పాత్ర లువాక్ కాఫీని సివెట్ అనే పిల్లి మలంతో తయారు చేస్తారు. ముందుగా పిల్లికి పచ్చి కాఫీ గింజలు తినిపిస్తారు. ఆ తరువాత ఆ పిల్లి మలంతో వచ్చే కాఫీ భాగాన్ని వేరు చేసి దాంతో కాఫీ తయారు చేస్తారు. పిల్లి ప్రేవుల్లోంచి వెళితే కాఫీకు రుచి పెరుగుతుందని నమ్మకం.
లువాక్ కాఫీ ఎలా చేస్తారు సివెట్ పిల్లి మలంలో ఉండే కాఫీ గింజల్ని శుభ్రం చేసి డ్రై ఫ్రై చేస్తారు. జర్మ్స్ లేకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ చాలా కీలకం
ప్రపంచంలోనే అతి ఖరీదైన ఈ కాఫీ ధర ఎంత ప్రపంచంలో అతి ఖరీదైన ఈ కాఫీ ధర వేలల్లో ఉంటుంది. ఒక కిలో లువాక్ కాఫీ గింజలు 50 వేలు పలుకుతాయి. అంటే ఒక కప్పు లువాక్ కాఫీ ధర 2-6 వేలు ఉంటుంది.