Capsicum: రెడ్‌, ఎల్లో, గ్రీన్‌ ప్రతిరోజూ తినడానికి ఏ క్యాప్సికం ఆరోగ్యకరం తెలుసుకోండి..

 Which Colour capsicum better:  క్యాప్సికమ్‌ వివిధ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రతిరోజూ మనం క్యాప్సికమ్‌ తినాంటే ఏ రంగు క్యాప్సికమ్‌ ఆరోగ్యానికి మంచిదో తెలుసా? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

1 /5

Which Colour capsicum better: క్యాప్సికమ్‌ కూరను సలాడ్‌ ఇంట్లో వివిధ వంటలు తయారు చేసుకుంటాం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలం. క్యాప్సికమ్‌లో విటమిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్‌ వివిధ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రతిరోజూ మనం క్యాప్సికమ్‌ తినాంటే ఏ రంగు క్యాప్సికమ్‌ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?  

2 /5

ఒకవేళ మీరు మీ శరీరానికి విటమిన్‌ ఏ, సీ కావాలంటే ఎరుపు రంగు క్యాప్సికమ్‌ తీసుకోవాలి. ఇందులో విటమిన్ కే ఉంటుంది. రెడ్‌బెల్‌ పెప్పర్‌ ఈ రెండు విటమిన్స్‌ లేమిని తొలగిస్తుంది.

3 /5

రెడ్‌ బెల్‌ పెప్పర్స్‌.. ఎరుపు రంగు బెల్‌ పెప్పర్‌లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది గ్రీన్‌, ఎల్లో క్యాప్సికమ్‌ల కంటే ఎక్కువ ఆరోగ్యానికి , కంటి చూపునకు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపడేలా చేస్తుంది. ఎరుపు రంగు బెల్‌ పెప్సర్స్లో విటమిన్‌ సీ గ్రీన్‌, ఎల్లో క్యాప్సికమ్‌ల కంటే అధికంగా ఉంటుంది. విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఐరన్‌ గ్రహించడంలో సహాయపడుతుంది.

4 /5

గ్రీన్ బెల్‌ పెప్పర్.. ఈ రంగు క్యాప్సికమ్‌ వంటల్లో ఎక్కువ శాతం వినియోగిస్తార. ఇది రెడ్‌ క్యాప్సికమ్‌ కంటే కాస్తు చేదుగా ఉంటుంది. అయితే, ఇందులో విటమిన్‌ కే పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్‌ క్లాట్‌ కాకుండా కాపాడి ఎముక ఆరోగ్యానికి ఎంతో కీలకం. గ్రీన్‌ బెల్‌ పెప్పర్‌ లో విటమిన్‌ సీ కూడా ఉంటుంది.

5 /5

పసుపు రంగు క్యాప్సికమ్‌.. ఎల్ల కలర్‌ బెల్‌ పెప్ప‌ర్‌ కూడా మనకు మార్కెట్లో విస్తృతంగా కనిపిస్తుంది. ఇందులో కూడా ఎన్నో పోషకాలు ఉంాయి. ఈ రంగు క్యాప్సికమ్‌ కూడా రుచి కాస్త తీయగా ఉంటుంది.  రెడ్‌, గ్రీన్‌ క్యాప్సికమ్‌ మాదిరి ఇందులో కూడా విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)