Ashada Month 2024: ఆషాఢమాసం జూలై 5 లేదా 6? ఎప్పటి నుంచి ప్రారంభం తెలుసుకోండి..

Ashada Month 2024 Date: ఆషాఢ మాసం ప్రతి ఏడాది వస్తుంది. ఇది జ్యేష్ఠమాసం వెంటనే వస్తుంది. ఈ నెల ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా బోనాలు సమర్పిస్తారు. ఈ మాసంలో కొత్త కోడళ్లు కూడా అత్తింటికి దూరంగా ఉంటారు. పెళ్లిళ్లు శుభకార్యాలు జరగవు.
 

1 /5

ఆషాఢ మాసం ఈ ఏడాది ఏ రోజు రానుంది? జూలై 5 లేదా 6 ఏరోజు రానుంది తెలుసుకుందాం. ముఖ్యంగా ఆషాఢ అమావాస్య జూలై 5న రానుంది ఆ మరుసటిరోజు అంటే జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది.  

2 /5

జూలై 6న ఆషాఢమాసం ప్రారంభం. జూలై 7న శుక్ర మూఢమీ ఆఖరు జూలై 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జూలై 10 స్కంధ పంచమి జూలై 11 కుమార షష్ఠి జూలై 13 వివస్వత సప్తమీ జూలై 16 దక్షిణాయనం ప్రారంభం జూలై 17 శాకంబరి ఉత్సవాలు జూలై 18 వాసుదేవ ద్వాదశి జూలై 20 పుష్యమి కార్తె జూలై 24 సంకటహర చతుర్థి

3 /5

ఆషాఢ అమావాస్య తిథి జూలై 5వ తేదీ ఉదయం 04:57 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి జూలై 6వ తేదీ తెల్లవారుజామున 04:26 గంటలకు ముగుస్తుంది. అంటే ఈరోజు నుంచే ఆషాఢమాసం కూడా ప్రారంభమవుతుంది.  

4 /5

ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలను సంతోష పరిచే కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా ఈరోజు పేదలకు దానం ధర్మాలు చేస్తారు. ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం ఆచరించినా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  

5 /5

ఆషాఢ మాసంలో పితృదేవతలకు నల్ల నువ్వులు సమర్పించడం వల్ల వాళ్లు సంతోషిస్తారు. ఈ అమావాస్య తర్పణం అందించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. అంతేకాదు ఈరోజు రావిచెట్టును పూజిస్తే సుకః సంతోషాలు కలుగుతాయి. ఈరోజంతా స్నానం దానానికి ప్రత్యేకం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)