WhatsApp META AI: వాట్సప్‌లో కన్పించే బ్లూ రింగ్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్లకు అద్భుతమైన ఫీచర్లు అందిస్తూ వస్తోంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో వాట్సప్‌లో బ్లూ రింగ్ ఒకటి కన్పిస్తోంది. కానీ చాలామందికి ఈ బ్లూ రింగ్ గురించి తెలియదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్. ఈ బ్లూ రింగ్ ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇక వదిలిపెట్టరు. చాలా పనులు సులభంగా పరిష్కారమైపోతాయి.

WhatsApp META AI: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్లకు అద్భుతమైన ఫీచర్లు అందిస్తూ వస్తోంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో వాట్సప్‌లో బ్లూ రింగ్ ఒకటి కన్పిస్తోంది. కానీ చాలామందికి ఈ బ్లూ రింగ్ గురించి తెలియదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్. ఈ బ్లూ రింగ్ ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇక వదిలిపెట్టరు. చాలా పనులు సులభంగా పరిష్కారమైపోతాయి.

1 /5

వాట్సప్ ఫీచర్ వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త అప్‌డేట్స్ అందిస్తుంటుంది. కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటుంది. తద్వారా యూజర్లకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయి. ఇందులో భాగంగానే ఇటీవల బ్లూ రింగ్ ఒకటి తీసుకొచ్చింది

2 /5

వాట్సప్ బ్లూ రింగ్ వాట్సప్ బ్లూ రింగ్ పేరు మెటా ఏఐ. చాటింగ్ విధానాన్నే ఇది మార్చేసింది. యూజర్లకు పని సులభం చేసేసింది. 

3 /5

ఎలా ఉపయోగించాలి మెటా సహాయంతో ఏదో ఒక టాపిక్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. లేటెస్ట్ సినిమాల గురించి అడగవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చు. బెస్ట్ రెస్టారెంట్స్, బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ గురించి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు.

4 /5

ఈ ఫీచర్ ఎక్కడ ఉంటుంది వాట్సప్ హోమ్ స్క్రీన్‌పై కుడివైపున కింది భాగంలో ఉంటుంది. ఇది బ్లూ రింగ్‌లా కన్పిస్తుది. దీనిపై క్లిక్ చేయగానే చాట్ మొదలవుతుంది. 

5 /5

ఏఐ చాట్‌బోట్ ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బోట్. విభిన్న రకాల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. సమచారం అందిస్తుంది. మీతో మాట్లాడుతుంది