Aishwarya Rai: ఇండస్ట్రీలోకి రాకముందు ఐశ్వర్య ఏం చేసేదో తెలుసా.. ఆమె మొదటి జీతం ఎంతంటే..?

Aishwarya Rai first remuneration: మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఇండస్ట్రీలోకి రాకముందు ఒక బట్టల బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ మోడల్ గా కెరియర్ మొదలు పెట్టింది. ఇలా బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకుగాను ఈమెకు 1500 రూపాయలు జీతం గా ఇచ్చేవారు.  ఇదే ఆమె మొదటి పారితోషకం కావడం గమనార్హం.
 

1 /5

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వ సుందరిగా పేరు సొంతం చేసుకున్న ఈమె తన అందంతోనే కాదు నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇరువర్ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసిన ఐశ్వర్య,  ఆ తరువాత మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. మణిరత్నం ఈమెకు మొదటి సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. మొదటి సినిమాతోనే ఈమె అందాన్ని చూసి ప్రేక్షకులు సైతం నివ్వెరపోయారు. ఇక అక్కడి నుంచి మొదలైన ఈమె నట ప్రయాణం తన జీవితాన్నే మార్చేసింది. 

2 /5

తన అందంతోనే కాదు అద్భుతమైన శరీర ఆకృతితో యావత్ ప్రపంచ అభిమానులను సొంతం చేసుకున్న ఈమె, ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఇప్పటికీ కూడా అడపాదడపా సినిమాలలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్న ఈమె ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన  పొన్నియన్ సెల్వన్  సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.

3 /5

ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్యారాయ్ ఇద్దరూ ఇప్పుడు విడాకుల వార్తలతో సతమతమవుతున్నారు . ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉన్నా బయట మాత్రం వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. 

4 /5

ఇకపోతే ఐశ్వర్యారాయ్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు. అసలు ఆమె మొదటి పారితోషకం ఎంత ?అనే విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య ఇండస్ట్రీలోకి రాకముందు బట్టల యొక్క బ్రాండ్ కి మోడల్గా పనిచేసింది. ఆ బ్రాండ్ కు సంబంధించిన బట్టలు వేసుకొని ఫోటోలకు ఫోజులిస్తూ బ్రాండ్ ను ప్రమోట్ చేసేది. ఇలా చేసినందుకుగాను ఈమెకు రూ.1500 మాత్రమే జీతం గా ఇచ్చేవారు.   

5 /5

1992లో ఒక ప్రైవేట్ బ్రాండ్ లో మోడల్ గా పనిచేస్తున్నప్పుడు.. అందుకు ఫలితంగా 1500 రూపాయలను ఆమెకు పారితోషకంగా ఇచ్చారు. ఆ తర్వాత 1994లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో మన దేశం తరఫున పాల్గొన్న ఈమె మొదటిసారి ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకుంది. అలా 1500 రూపాయలకు పని చేసిన ఈమె నేడు ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు తీసుకుంటూ.. రూ .776 కోట్లు కూడబెట్టినట్లు సమాచారం