Tarpana: తర్పణం అంటే ఏంటి? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

Pitru Tarpanam: తర్పణం అనేది చేసే పూజను బట్టి ఉంటుందని, తర్పణం అంటే సమర్పించడం అని.. పితృతర్పణం చేసేవారు,  తండ్రి లేని వారు మాత్రమే పితృతర్పణం చేయాలి అని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం మహాలయ పక్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పితృతర్పణం ఇవ్వడం తప్పనిసరి అని,  ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి సంతాన, ఆయురారోగ్య అభివృద్ధి కలుగుతుందని చెబుతున్నారు.

1 /5

సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మహాలయ పక్షాలు కొనసాగుతాయి. ఈ 15 రోజులపాటు సాగి మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. అయితే ఈ తర్పనం అంటే ఏమిటి..? ఎందుకు పితృదేవతలకు మాత్రమే తర్పణాలు వదులుతారు.? అనే విషయాలు బహుశా చాలామందికి తెలియవనే చెప్పాలి. మరి ఈ కథనం ద్వారా వీటి యొక్క ఆంతర్యం ఏమిటో మనం చూద్దాం. 

2 /5

తర్పణాలు అంటే పితృదేవతలకు సమర్పించేవి అని,  ప్రజానీకంలో ఇది ఒక దురభిప్రాయంగా ఉంది. కానీ దేవతలకు, నవగ్రహాలకు, ఋషులకు కూడా తర్పణాలు ఇస్తారని, ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తాజాగా తెలిపారు.  తర్పణం అంటే సమర్పణ అని అర్థమట. నైవేద్యం అని కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. తర్పణాలు చేసే వస్తువును బట్టి ఉంటాయని, పితృ దేవతలకు చేసేది తిలతర్పణమని ఆయన స్పష్టం చేశారు. అంటే ముడి నువ్వులను నీటితో కలిపి సమర్పించేది అన్నమాట. దేవి దేవతలు నవగ్రహాల మూలమంత్రాలను జపించినప్పుడు కూడా తర్పణాలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. 

3 /5

ప్రతి 10 మూల మంత్ర పఠనాలకు ఒకసారి తర్పణం  ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. మానవులమైన మనం పుట్టినందుకు మనం మూడు రకాల రుణాలు తీర్చుకోవాలి. దేవరుణం, రుషి రుణం, పితృ ఋణం. ఈ జగత్తుకు కారణభూతులైనందుకు దేవతల రుణం శాస్త్రాలు ధర్మాలు, పురాణ ఇతిహాసాలను అందించినందుకు,  ఋషుల రుణం, మన జన్మకు కారకులైన వారికి పితృ రుణం తీర్చుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ మూడు రకాల రుణాలను మనం తర్పణాల ద్వారానే తీర్చుకోగలుగుతామట.

4 /5

ప్రతిరోజు కూడా దేవ , ఋషి పితృదేవతలకు తర్పణాలు వదలాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు దేవా ఋషి తర్పణాలను వదలాలని , పితృతర్పణ తండ్రి లేని వారు మాత్రమే చేయాలి అని కూడా తెలిపారు. ముఖ్యంగా పద్మ పురాణంలో కూడా తర్పణాలకు సంబంధించి విధి విధానాలను చక్కగా స్పష్టం చేశారని తెలిపారు. 

5 /5

లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయన్తీమ్ అంటూ జలతర్పణ ఇవ్వాలని,  మీరే కాకుండా ఆవు పాలను కూడా తర్పణంగా సమర్పించవచ్చని స్పష్టం చేశారు. దేవి దేవతలకు , శనికి అల్లం , శొంఠి కూడా తర్పణమిస్తారట. ఇలా తర్పణాలు చాలా రకాలు ఉంటాయని,  ఆచరించే పద్ధతిని బట్టి తర్పణం ఇవ్వడం అనేది మారుతుందని ఆయన తెలిపారు.