Watermelon: సమ్మర్‌లో ప్రతిరోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

Watermelon Benefits During Summer: వేసవిలో తరుచుగా మనం డీహైడ్రేషన్‌, అలసట, నీరసం వంటి సమస్యల బారిన పడుతుంటాము. ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు కొన్ని రకాల పండ్లలు, కూరగాయలను తీసుకుంటారు. అందులో పుచ్చకాయను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

  • May 22, 2024, 16:18 PM IST

Watermelon Benefits During Summer: వేసవిలో పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్‌లో దొరికే మామిడి, పుచ్చకాయకు ఎంతో క్రేజ్‌ ఉంటుంది. అయితే వేసవిలో ప్రతిరోజు పుచ్చకాయను తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. 

1 /6

పుచ్చకాయలో ఉండే విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంట్‌లు రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడం మంచిది.

2 /6

పుచ్చకాయలో 95% వరకు వాటర్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది వేసవిలో కలిగే దాహం, అలసటను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్‌ సమస్యలను తగ్గిస్తుంది.   

3 /6

పుచ్చకాయలో ఉండే అమైనో యాసిడ్‌ సిట్రులిన్‌ వంటి పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తాయి.  

4 /6

పుచ్చకాయలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది. దీని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.   

5 /6

పుచ్చకాయను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. 

6 /6

మీరు పుచ్చకాయను తీసుకొనే ముందు ఆరోగ్యనిపుణులు లేదా డైట్‌ నిపుణులు సంప్రదించి ఆహారం తీసుకోవడం మంచిది.