Weight Loss Tips: ఈ నియమాలు పాటిస్తే కేవలం 7 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు..!

Weight Loss In 7 Days: శరీర బరువును నియంత్రించుకునేందు చాలా మంది వివిధ రకాల వ్యాయమాలు చేస్తున్నారు. కానీత ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అలాంటప్పుడు పలు నిపుణులు సూచించిన పలు రకాల నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు.

  • Aug 18, 2022, 10:10 AM IST

Weight Loss In 7 Days: శరీర బరువును నియంత్రించుకునేందు చాలా మంది వివిధ రకాల వ్యాయమాలు చేస్తున్నారు. కానీత ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అలాంటప్పుడు పలు నిపుణులు సూచించిన పలు రకాల నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి పాలు రకాల ఆహార నియమాలు పాటించాలి. శరీరాని బరువు తగ్గే క్రమంలో తప్పకుండా మంచి ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. బరువును తగ్గించడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

1 /5

తక్కువ కాలంలో ఎక్కువ బరువును తగ్గడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషధాలున్నాయి. అయినప్పటికీ ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. అంతేకాకుండా చాలా మందికి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని కోసం ప్రతి రోజూ 5 నుంచి 8 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఇలా నీటిని తాగడం వల్లు సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

2 /5

శరీర అభివృద్ధికి ప్రోటిన్లు అధికంగా ఉండే ఆహారాలు చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. అయితే బరువు తగ్గే క్రమంలో కూడా మంచి ప్రోటిన్లు కలిగిన ఆహారాలను తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెల్తీగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

3 /5

బాడీకి ఆకు కూరలు చాలా అవసరం.. ఇవి శరీరంలో వ్యాధినిరోగ శక్తి పెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే బరువు తగ్గే క్రమంలో మంచి పోషకాలున్న ఆకూ కూరలను తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి వినియోగించే చిట్కాల్లో ముఖ్యమైన చిట్కా అని చెప్పొచ్చు.

4 /5

బరువు తగ్గే క్రమంలో చాలా మంది చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమణాలు పెరిగి వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కావున బరువు తగ్గాలనుకునే వారు చక్కెర పదార్థాలకు దూరంగా ఉండడం చాలా మేలు..

5 /5

బరువును సలుభంగా తగ్గించుకోవడానికి తప్పకుండా పలు రకాల నియమాలు తూ.చ పాటించాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గే క్రమంలో తప్పకుండా వాకింగ్‌ చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోయి. శరీర బరువు కూగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా చాలా మందిలో మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.