Weight Control Tips: నెలలో 5 కిలోలు బరువు తగ్గాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు

మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండటం చాలా అవసరం. కానీ ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. స్థూలకాయం తగ్గించే ప్రయత్నాలు చేయాలి. నెలలో 4-5 కిలోల బరువు తగ్గాలనుకుంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. బరువు తగ్గడం అనేది క్రమ క్రమంగానే జరగాలి. ఒకేసారి బరువు తగ్గడం మంచిది కాదు. 

Weight Control Tips: మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండటం చాలా అవసరం. కానీ ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. స్థూలకాయం తగ్గించే ప్రయత్నాలు చేయాలి. నెలలో 4-5 కిలోల బరువు తగ్గాలనుకుంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. బరువు తగ్గడం అనేది క్రమ క్రమంగానే జరగాలి. ఒకేసారి బరువు తగ్గడం మంచిది కాదు. 

1 /6

తగినంత నిద్ర రోజూ తగినంత నిద్ర అవసరం. నిద్ర తక్కువ ఉండటం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఎప్పుడైతే నిద్ర తక్కువైందో తిండిపై కోరిక పెరుగుతుంది. అందుకే రాత్రి వేళ నిద్ర 7-8 గంటలు తప్పకుండా ఉండాలి.

2 /6

నో షుగర్ నో ప్రోసెస్డ్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్స్, స్వీట్స్, షుగర్ కంటెంట్ డ్రింక్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. వీటిలో పోషకాలు తక్కువ, కేలరీలు ఎక్కువ ఉంటాయి. 

3 /6

హైడ్రేట్  రోజంతా నీళ్లు తాగుతుండాలి. హెర్బల్ టీ వంటివి తాగడం మంచిది. దాహం వేసిన వేయకున్నా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. 

4 /6

రోజూ తగినంత వ్యాయామం మీ రోజువారీ జీవితంలో తగినంత వ్యాయామం లేదా వాకింగ్ ఉండేట్టు చూసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున కేలరీలు బర్న్ అవుతాయి.

5 /6

బ్యాలెన్సింగ్ డైట్ అతిగా తినకుండా జాగ్రత్త పడాలి. దీనికోసం చిన్న చిన్న ప్లేట్లు, గిన్నెలు వినియోగించాలి. టీవీ, కంప్యూటర్ ముందు కూర్చుని లేదా మొబైల్ ఫోన్ చూస్తూ తినడం మానుకోవాలి.

6 /6

పోషక ఆహారం కేలరీలు పుష్కలంగాఉండే ఆహారాన్ని తగ్గిస్తూ..పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.