Best Home Remedy: అరటి పండ్లు మిరియాలు నెలరోజులు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా

Best Home Remedy: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాలలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు చాలా ఉంటాయి. ఏవి ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుంటే చాలు..అందులో ఒకటి అరటి పండ్లు, మిరియాల కాంబినేషన్. రోజూ ఉదయం పరగడుపున మిరియాలు, అరటి పండ్లు తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. 

Best Home Remedy: ఆయుర్వేదంలో ఇదొక అద్భుతమైన హోమ్ రెమిడీ. ఈ చిట్కాను సూపర్‌ఫుడ్ అంటారు. నెలరోజులు ఈ చిట్కా పాటిస్తే ఇమ్యూనిటీ పెరగడం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి 5 అద్భుతమైన లాభాలు చూడవచ్చు.

1 /5

ఇమ్యూనిటీ  మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువ. ఇవి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ నుంచి రక్షణ కల్పిస్తాయి. 

2 /5

బరువు నియంత్రణ బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ రెమిడీ. అరటి పండు శరీరానికి ఎనర్జీ అందిస్తుంది. అటు మిరియాలు మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దాంతో బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది.

3 /5

జీర్ణక్రియ పటిష్టం అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మిరియాలు ఎంజైమ్స్ విడుదలను పెంచుతాయి. ఫలితంగా జీర్ణక్రియ బాగుంటుంది. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల్ని అద్భుతంగా పరిష్కరించే చిట్కా ఇది.

4 /5

మానసిక ఆరోగ్యం అరటి పండ్లలో  ట్రిప్టోఫోన్ అనే ఎమైనో ఆసిడ్ ఉంటుంది. ఇది సెరిటోనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. మిరియాలు మానసిక అలసటను తగ్గిస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి.

5 /5

చర్మానికి నిగారింపు అరటి పండ్లలో విటమిన్లు,మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి అంతర్గతంగా పోషకాలు అందిస్తాయి. ఈ రెమిడీ శరీరంలోని విష పదార్ధాలను బయటకు తొలగిస్తుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా నిగనిగ లాడుతూ ఉంటుంది.