Virender Sehwag: విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ .. 20 ఏళ్ల బంధానికి బ్రేక్‌?

Virender Sehwag Aarti Divorce: విడాకుల బాటలో వీరేంద్ర సెహ్వాగ్‌‌.. కొద్దిరోజులుగా విడివిడిగా ఉంటున్న ఈ స్టార్‌ కపుల్స్‌. భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతని భార్య ఆర్తి 20 ఏళ్ల పెళ్లి బంధానికి బ్రేక్ వేయనున్నారు. 2004లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.. అయితే తాజాగా వీరు ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఉందని వైరల్ అవుతుంది. వీరిద్దరూ చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్నారు.'
 

1 /5

వార్త కథనాల ప్రకారం వీరేంద్ర సెహ్వాగ్‌ భార్య ఆర్తి అహ్లవత్‌లు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2004లో  వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సెహ్వాగ్ ఆర్తిలో ఎన్నో రోజులుగా విడివిడిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వాళ్ళు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.  

2 /5

సెహ్వాగ్  ఇటీవల పాలక్కడ్‌ ఆలయం సందర్శించినప్పుడు కూడా సింగిల్‌గానే వచ్చారు. అంతేకాదు దీపావళి రోజు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అందులో కూడా కేవలం తల్లి పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆర్తి ఎక్కడా కనిపించలేదు.  

3 /5

ఢిల్లీకి చెందిన ఆర్తి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. 2000 నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది.. ఆ తర్వాత 2004లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరూ మధ్య మనస్పర్ధలు కారణంగా విడివిడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.  

4 /5

ప్రతి ప్రత్యేక వేడుకల్లో, పండుగలకు సంబంధించిన ఫోటోలను సెహ్వాగ్‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కానీ, కొద్దిరోజులుగా ఆర్తీకి సంబంధించిన ఫోటోలు మాత్రం ఆయన షేర్ చేయలేదు. ఇది కాకుండా వీరు తాజాగా ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో కూడా చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత ఊతం అందిస్తుంది.  

5 /5

ఇక 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీరేంద్ర సెహ్వాగ్ గుడ్ బై చెప్పారు. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ దాదాపు 104 టెస్టులు ఆడారు. మొత్తం 8586 రన్స్ పూర్తి చేశారు. అయితే, విడాకుల విషయం అయి అధికారికంగా ఈ స్టార్‌ కపుల్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలా స్పందిస్తారో చూడాలి మరి..