VC Sajjanar: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ వీడియోపై సజ్జనార్ ఫైర్.. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా..?

VC Sajjanar on Online Betting Apps: ఇటీవల సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కాస్త ఫాలోవర్స్ రాగానే.. డబ్బుల కోసం అడ్డమైన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. వారిని నమ్మి ఎంతోమంది యువత డబ్బులు పెట్టి.. భారీగా నష్టపోతున్నారు. కొందరు అప్పులు చేసి మరీ బెట్టింగ్ పెట్టి.. చివరకు ఆ అప్పుల ఒత్తిడి తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ వీడియోపై టీజీ ఆర్టీసీ ఎండీ ఫైర్ అయ్యారు.

 

 

 

1 /5

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఓ కెమెరాను కొనుగోలు చేసేందుకు డబ్బులను ఓ బెట్టింగ్ యాప్‌లో సంపాదించినట్లు వీడియోను వదిలాడు. ఈ వీడియోను సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. బెట్టింగ్ కూపంలో పడకండని హెచ్చరించారు.  

2 /5

చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో అని సజ్జనార్ అన్నారు. అలా షాప్‌కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చంట అని వీడియోను షేర్ చేశాడు.  

3 /5

ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. అని అన్నారు. ఒకవైపు ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

4 /5

"మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు." అని సజ్జనార్ సూచించారు.   

5 /5

స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి అని కోరారు.