Union Budget 2025: కొత్త సంవత్సరం షురూ అవ్వగానే.. అందరి దృష్టి 2025 బడ్జెట్ వైపే మళ్లుతుంది. యూనియన్ బడ్జెట్ 2025 కి కౌన్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ సారి ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు, లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు వస్తుందోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక అభివృద్ధిని పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది బడ్జెట్ పై చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను సానుకూల దిశలో నడిపిస్తామని భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్యూయల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 40 శాతం తగ్గాయి. అయినప్పటికీ ఎక్సైజ్ సుంకాల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ పన్నులను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుంది. అలాగే కుటుంబాలకు ఖర్చు చేసే శక్తి వినియోగం పెరుగుతుంది.
గ్రామీణ వినియోగం ఆహార భద్రతను పెంచడం: గ్రామీణ వినియోగం రికవరీ అవుతున్నట్లు అనిపిస్తుంది. అయితే దీనికి మరింత మద్దతు అవసరం. ఎందుకంటే ఉపాధి హామీ పథకం రోజు వారి వేతనాలను 267 రూపాయల నుంచి 375 రూపాయలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. పీఎం కిసాన్ చెల్లింపులను ఏడాదికి 6000 నుంచి 8 వేలకు పెంచాలని కోరుతున్నారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు వారికోసం కన్జమన్స్ వోచర్స్ ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిని మెరుగుపరచడంతో పాటు డిమాండ్ ను పెంచడం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం వృద్ధికి తోడ్పటు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఉపాధి కల్పన రంగాలకు మరింత ప్రోత్సాహం: నిరుద్యోగాన్ని తగ్గించేందుకు పరిశ్రమ నిపుణులు పలు రంగాలకు లక్ష్యాలను ప్రతిపాదించారు. ఇందులో గార్మెంట్, ఫుట్వేర్, టూరిజం, ఫర్నిచర్ రంగాలు ఉన్నాయి. ఈ రంగాలు శ్రమతో కూడుకున్నవి. గ్లోబల్ మార్కెట్లో భారతదేశాన్ని మరింత పటిష్టంగా ఉంచుతూ ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
పన్ను ఉపశమనం: ఏడాదికి 20 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి ఎక్కువ ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని ఇండస్ట్రీ లీడర్స్ పిలుపునిచ్చారు. ఈ చర్య డిస్పోజబుల్ ఇన్కమ్ ని పెంచుతుంది. ఫలితంగా వినియోగం ఆర్ధిక కార్యకలాపాలు పెరుగునున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకరించే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎఫ్ ఐ సి సి ఐ ప్రెసిడెంట్ విజయశంకర్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం..పెరుగుతున్న జీవన వ్యయాలతో భారం మోస్తున్న మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయాలని తెలిపారు.
చైనా డంపింగ్ను ఎదుర్కోవడం గ్లోబల్ మార్కెట్లో చైనా అదనపు స్టాక్ ను డంపు చేయడం భారతీయ పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దేశీయ వ్యాపారాలను రక్షించడంతోపాటు న్యాయమైన పోటీని ప్రోత్సహించేందుకు రక్షణ చర్యను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
2025 బడ్జెట్ ముందున్న ఆర్థిక సవాలు ఇవే 2024 రెండో త్రైమాసికంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5.4 శాతానికి క్షీణించింది. బలహీనమైన పెట్టుబడులు ఎగుమతులు తగ్గడం దీనికి కారణమని చెప్పవచ్చు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సరఫరా గొలుసుఅంతరాయాలు పురోగతిని మరింత దెబ్బతీశాయని చెప్పవచ్చు. 2024 లో రిటైల్ ద్రవ్యోల్బణం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం నాలుగు శాతం కంటే ఎక్కువ గానే ఉంది. అయితే 2024 లో అక్టోబర్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆర్బిఐ గరిష్ట పరిమితిని ఆరు శాతాన్ని మించి 6.21 శాతానికి తాకింది. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బిఐ పాలసీ రేట్లు 6.5% వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం అస్థిరంగా ఉంది. ఆహార ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. రానున్న బడ్జెట్లో ఈ ఆర్థిక అడ్డంకులు పరిష్కరించడం కీలకంగా మారింది.