Tirumala Rains: ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Tirumala Rains: తుఫానులతో తమిళనాడు సహా ఏపీలో తిరుపతి సహా పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం, తుఫానులు విరుచుకుపడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఎక్కడ చూసినా వరద నీటితో అన్ని ప్రాంతాలు బురదమయంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది.ముఖ్యంగా తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోట్స్ లో భారీ వర్షాలతో కొండపై ఉన్న గో గర్భం, పాపనానశం డ్యామ్స్ నిండి పొంగిపొర్లుతున్నాయి.
తిరుమల కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు కొండపై చలి తీవ్రత భారీగా పెరిగింది. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు భారీ వర్షాలతో ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచనలు చేసింది. వర్షానికి జారీ పడే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.
మరోవైపు భారీ వర్షాలకు కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో ప్రజలతో పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలకు పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది. మరోవైపు గోగర్భం, పాపవినాశనం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని కిందికి ఒదులుతున్నారు.
అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. రేణిగుంట మండలం అత్తూరు దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తిరుపతి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ సెలవు ప్రకటించారు. ఉదయం నుంచి తిరుమల తిరుపతిలో కుండపోత వాన కురుస్తోంది.