Ttd big Alerts to devotees: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం వార్తలలో నిలిచింది.
తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. స్వామి వారికోసం భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. ఎన్ని గంటలైన కంపార్ట్ మెంట్ లో వేచిఉంటారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇటీవల తిరుమలలో వరుసగా అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. తిరుమల వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తొక్కిసలాట తిరుమల చరిత్రలో మాయని మచ్చగా చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో టీటీడీ మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.
ఈ క్రమంలో తిరుమలలో ఫిబ్రవరి 4న రథసప్తమి ఉత్సవం జరుగనుంది.దీనికి భక్తులు దేశ వ్యాప్తంగా భారీగా తరలి వస్తుంటారు. ఈ క్రమంలో టీటీడీ పాలక మండలి తాజాగా సమావేశమయ్యింది. తిరుమలలో రథ సప్తమి నేపథ్యంలో స్వామివారికి చేసే కైంకర్యాలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో తిరుమలలో ఫిబ్రవరి 4న భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకోని వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో శ్యామలరావు ప్రకటించారు. ప్రొటొకాల్ అధికారులకు మినహయించి ప్రివిలేజ్ దర్శనాలు అంటే.... అష్టదళ పాత పద్మారాధన, కల్యాణోత్సం, ఊంజల్ సేవ, ఆర్జీత బ్రహ్మోత్సవం, సహాస్ర దీపాలంకరణ, ఎన్ ఆర్ ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ లు, దివ్యాంగులకు దర్శనాలు రద్దు చేస్తు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
రథసప్తమి వేడుకలకు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులతో పాటు టీటీడీలో అన్ని విభాగాలతో కలిసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. రథసప్తమి నాడు వాహన సేవలను తిలకించేందుకు లక్షలదిగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
శ్రీవారు రథసప్తమి రోజు మలయప్ప స్వామిగా.. ఏడు వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారని అన్నారు. పుష్కరణిలో స్వామివారికి చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రథసప్తమి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని చెప్పారు.
అదే విధంగా.. ఫిబ్రవరి 3,4,5వ తేదీల్లో సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రథ సప్తమి రోజున తెల్లవారు జామున నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయని టీటీడీ వెల్లడించింది. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.