2024 Food Business Idea: ప్రస్తుతం చిన్న వ్యాపారాలు ఎంతగా ప్రాచుర్యం పొందుతున్నాయో అందరికీ తెలుసు. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ప్రారంభించగలిగే అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడుగా సోషల్ మీడియా మార్కెటింగ్ సేవలు కూడా సహాయపడుతాయి. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కలలను నెరవేరుస్తుంది. ఈ బిజినెస్‌కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
చిన్న వ్యాపారాలు పెద్ద పెద్ద కార్పొరేషన్ల కంటే చాలా తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. చిన్న ఐడియాతో కూడా లక్షలాది రూపాయలు సంపాదించడం సాధ్యమే.
ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. అందుకే ఫుడ్ బిజినెస్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా నేటి బిజీ లైఫ్‌స్టైల్ వల్ల ఇంట్లో వండుకొని తినడానికి సమయం దొరకడం లేదు.
చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తున్నారు. వంట చేయడానికి సమయం దొరకడం లేదు. స్మార్ట్‌ఫోన్‌ల రాకతో చాలా మంది ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు.
మరి కొంతమంది రోడ్‌సైడ్ హోటళ్లలో ఆహారం సరసమైన ధరలకు లభిచడంతో హోటల్ ఫూడ్‌కు అల్లవాటు పడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి ఫుడ్ బిజినెస్‌లో ప్రారంభించాలని అనే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ఇప్పుడు చాలామంది ఫుడ్ బిజినెస్‌లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించే వ్యాపారం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ చిరుధ్యానాల టిఫిన్ సెంటర్ వ్యాపారం. ప్రజలు ఇప్పుడు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. వారు రుచికరమైన ఆహారంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా కోరుకుంటున్నారు.
వెజిటేరియన్, వీగన్, గ్లూటెన్-ఫ్రీ వంటి నిర్దిష్ట ఆహార అలవాట్లు ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఈ బిజినెస్ ఎంతో బెస్ట్ ఐడియా.
చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారు చేసే ఆహారాలు శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలను అందిస్తాయి. దీంతో ప్రతిరోజు వివిధ రకాల టిఫిన్‌లను తయారు చేసి అమ్ముతే బోలెడు లాభాలు కలుగుతాయి. మీ వ్యాపారం మూడు పూలు-ఆరు కాయలు అవ్వడం ఖాయం.
ఈ బిజినెస్ ప్రారంభించే ముందు మీ టిఫిన్ సెంటర్‌ను ఏ ప్రాంతంలో ప్రారంభించాలనుకుంటున్నారు? అక్కడ ఆరోగ్య ఆహారంపై ఆసక్తి ఎంత? ఆహారం తయారు చేసి అమ్మడానికి అవసరమైన లైసెన్స్‌లు తీసుకోండి.
ఫూడ్ బిజినెస్ ప్రారంభించడానికి రూ. 10వేల నుంచి రూ. 30 వేలు పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్‌ను ఇంటి నుంచి కూడా ప్రారంభించవచ్చు.
చిన్న స్టాల్‌ను స్టార్ట్ చేసి కూడా ఈ బిజినెస్‌ను రన్ చేస్తే మంచి లాభాలు కలుగుతాయి. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తే నెలకు రూ. 60,000 సంపాదింవచ్చు. సంవత్సరానికి రూ. 7 లక్షలు మీసొంతం. మీరు కూడా ఈ బిజినెస్ ఐడియాను ప్రారంభించండి.